మహేష్, త్రివిక్రమ్ సినిమా సంక్రాంతి మొదలు పెట్టనున్నారా..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇది వరకే అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమాలో అతడు సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. అలా మొదటి సారి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వీరిద్దరూ కలిసి మరొక సారి ఖలేజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో జనాల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఖలేజ సినిమా మంచి రెస్పాన్స్ లో తెచ్చుకో పోయినప్పటికీ టీవీలలో మాత్రం ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇప్పటికీ ఎన్ని సార్లు ప్రసారం అయినా కూడా టీవీ లలో ఈ సినిమా మంచి టీఆర్పీ రేటింగ్ ను సాధిస్తూ ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇలా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో హైడ్రిక్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతోమంది ఎదురు చూశారు.


 అలా ఎదురు చూసిన వారి ఎదురు చూపులకు కళ్ళెం వేస్తూ వీరిద్దరి కాంబినేషన్ లో  సినిమా రాబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అయితే తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోయే సినిమా సంక్రాంతి  పండగ సందర్భంగా మొదలు కాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు సినిమా కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు కూడా ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: