టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయన తన ప్రతిభతో అగ్ర దర్శకుడిగా ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఎక్కువగా అగ్ర హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలు అందుకున్న దర్శకుడిగా త్రివిక్రమ్ కి మంచి పేరుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'భీమ్లా నాయక్' సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి 'లాలా భీమ్లా' అనే పాటను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఈ పాటకు త్రివిక్రమ్ శ్రీనివాస్ లిరిక్స్ రాయడం విశేషం.
ఇప్పటివరకు రైటర్ గా, డైరెక్టర్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్న త్రివిక్రమ్.. ఈ పాటతో లిరిసిస్ట్ గా కూడా మారిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట అదిరిపోయే రెస్పాన్స్ కనబరుస్తోంది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ అయితే ఈ పాట ఉర్రూతలూగిస్తుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి త్రివిక్రమ్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వేదికగా రామజోగయ్యశాస్త్రి ట్వీట్ చేస్తూ..' వాట్ ఏ రైటింగ్ త్రివిక్రమ్ గారు అంటూ.. పడగల పాము పైన పాడమేడితే సామి తోడు, పిడుగులోచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు లాలా భీమ్లా. ఫుల్ మీల్స్ అంటూ చెప్పుకొచ్చారు రామజోగయ్య శాస్త్రి.
ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. ఇక తాజాగా విడుదల చేసిన లాల భీమ్లా పాట కూడా అంతకుమించి రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ ఈ పాటను రావడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజం చెప్పాలంటే ఈ పాటకి ఇంతలా రెస్పాన్స్ రావడానికి త్రివిక్రమ్ అందించిన లిరిక్స్ కూడా ఒక కారణమని చెప్పాలి. మొత్తానికి త్రివిక్రమ్ మరోసారి తన కలంతో మ్యాజిక్ చేశారనే చెప్పాలి...!!