పవన్ ను టార్గెట్ చేసిన జై భీమ్ !

Seetha Sailaja

దీపావళికి అమెజాన్ లో స్ట్రీమ్ అయిన ‘జై భీమ్’ నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ మూవీగా మారింది. ఈమూవీ నిర్మించింది సూర్య కావడంతో అతడికి పారితోషికం ఉండదు కాబట్టి ఈమూవీని 10 కోట్ల బడ్జెట్ లోపు నిర్మించారని లీకులు వస్తున్నాయి. ఈసినిమాకు వేసిన కోర్టు సెట్ అదేవిధంగా పాకల సెట్ తప్పించి ఈమూవీకి పెద్దగా ఖర్చు పెట్టిన అవసరం కనిపించడం లేదు.



ఇప్పుడు దేశం అంతా ఈసినిమా గురించి మాట్లాడుకుంతోంది. కొన్ని చోట్ల ఈమూవీ పై చర్చలు కూడ జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మన టాప్ హీరోలు ఇలాంటి సహజత్వంతో కూడిన సినిమాలలో ఎందుకు నటించరు అంటూ ఒక చర్చ మొదలైంది.



ముఖ్యంగా ఈమూవీని పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ తో పోలుస్తూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు కూడ వేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ మూవీ మాతృక అయిన ‘పింక్’ మూవీలో అమితాబచన్ వృద్ధుడుగా కనిపిస్తే ‘వకీల్ సాబ్’ దగ్గరకు వచ్చే సరికి పవన్ లుక్ లో బాగా మార్పులు చేయడమే కాకుండా ఈ కథలో ఒక హీరోయిన్ పాత్రను సృష్టించి ఆపాత్రను శ్రుతిహాసన్ తో నటింపచేసి ఆమెతో పవన్ కు పాటలు కూడ పెట్టారు.




అయితే ఇలాంటి షార్ట్ కట్స్ ఏమి లేకుండా ‘జై భీమ్’ లాయర్ పాత్రలో నటించిన సూర్య కు ప్రశంసలు లభిస్తు ఉండటంతో ప్రస్తుతం రాజకీయాలలో ఉన్న పవన్ ఇలాంటి సహజత్వంతో నిండిన పాత్రలను ఎందుకు ఎంపిక చేసుకోడు అంటూ కొందరు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు టాప్ సీనియర్ హీరోల దగ్గర నుండి టాప్ యంగ్ హీరోల వరకు సహజత్వంతో కూడిన సినిమాలలో నటించడానికి ఆశక్తి కనపరుస్తున్నారు అన్నది ఓపెన్ సీక్రెట్. ప్రస్తుతం తెలుగులో విడుదల అవుతున్న సినిమాలలో కేవలం 10 శాతం మాత్రమే విజయం అందుకుంటున్న పరిస్థితులలో వాస్తవాలను మన హీరోలు ఎప్పుడు గుర్తిస్తారో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: