అనుబంధాలను కాపాడిన వెంకీ "సంక్రాంతి"
సినిమాను ఒక పండుగ లాగా వెండి తెరపై వెలుగులు పంచవచ్చని ఈ మూవీని మన ముందుకు తీసుకువచ్చాడు దర్శకుడు ముప్పలనేని శివ. 2005 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. ఉమ్మడి కుటుంబం అంటే ఇలానే ఉండాలి. అందరూ కలిసి జీవిస్తే జీవితం అని అనిపించేలా ఈ స్టోరీని కనబరిచారు డైరెక్టర్. అన్నదమ్ముల అనుబందం. వదినమ్మ సహకారం, తల్లి తండ్రుల ప్రేమానురాగాలు, కామెడీకి కామెడీ, మనసును పరవసింపచేసే సంగీతం ఇలా అన్నిటినీ కలగలిపిన అందమైన చిత్రంగా సంక్రాంతి మూవీ సూపర్ హిట్ ను అందుకుంది.
ఉమ్మడి కుటుంబాల్లోని సంతోషం, విలువలు, అప్యాయతలు గురించి నేటి తరానికి తెలియచేసేలా ఈ చిత్రాన్ని తీయడం హర్షించదగ్గ అంశం. ఎస్ ఎ. రాజ్ కుమార్ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా వెంకీ కెరియర్ లో ఒక ఆణిముత్యం అనే చెప్పాలి. ఈ సినిమాను ఇప్పుడు చూసినా మనసుకు హత్తుకుపోతుంది. ఈ సినిమా ద్వారా ఎన్నో కుటుంబాలు విడిపోకుండా కలిసి ఉండి ఉంటారు. అంతటి పవర్ ఉంది ఈ సినిమాలో ఇంకా మరెన్నో ఇలాంటి సినిమాలు మనుషుల బంధాలను కలుపుకోయేలా రావాలని ఆశిద్దాం.