'విరాట పర్వం' విడుదల ఆలస్యానికి అసలు కారణం అదే..?

Anilkumar
'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి హీరో రానా నటిస్తున్న తాజా చిత్రం 'విరాటపర్వం'. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ ప్రియమణి మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం నల్లమల్ల అడవుల్లో జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరకూ విడుదలకు నోచుకోలేదు.నిజానికి ఏప్రిల్ నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా కరోనా సెకండ్ వల్ల వాయిదా పడింది.


అయితే కరోనా సెకండ్ తొలగి చాలా రోజులే అయింది. సినిమాలన్నీ విడుదలవుతున్నా కూడా విరాటపర్వం సినిమా మాత్రం రిలీజ్ అవడం లేదు. అందుకు అసలు కారణం ఈ సినిమా దర్శకుడు వేణు ఊడుగుల అని సమాచారం. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పటివరకు సినిమా రిలీజ్ కాకపోయే సరికి అందరూ అదే కారణమని అనుకున్నారు. అయితే అసలు కారణం మాత్రం అది కాదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడు ఎంపిక చేసుకున్న ఉచ్చారణ (భాష) కాస్త తప్పిదంగా కనిపిస్తోందట. అయితే ఈ సినిమాని పక్క తెలంగాణ భాషలో రూపొందించడం జరిగింది.


ఈ నేపథ్యంలోనే సినిమాలోని కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అర్థం కావనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో కొన్ని డైలాగులు మార్చమని నిర్మాత సురేష్ బాబు దర్శకుడికి తెలియజేశారట. అందువల్లనే ఈ సినిమాని మళ్లీ రీషూట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాని థియేటర్ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత సురేష్ బాబు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సురేష్ బాబు ఇప్పటికే ఈ సినిమా హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో డీల్ కుదుర్చుకుని భారీ రేటుకే అమ్మినట్లు చెబుతున్నారు. అయితే అందుకు సంబంధించి త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: