పవర్ స్టార్ పునీత్ అన్ని కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారట...!
అక్టోబర్ 29న పునీత్ అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో మరణించిన విషయం అందరికి తెలిసిందే. పునీత్ మరణంతో యావత్ సినీ లోకం మొత్తం విలపించిందని సమాచారం.
పునీత్ మరణం తర్వాత ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తుంది.పూనీత్ రాజకుమార్ ఎంతటి గొప్ప హృదయం ఉన్న వ్యక్తో అందరికీ అర్థం అవుతోందట పునీత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడనే సంగతి అందరికి తెలుసిందే పునీత్ స్వయంగా 26 అనాథాశ్రమాలు మరియు 45 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు అలాగే 19 గోశాలలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకు పునీత్ 1800 పేద విద్యార్థులకు విద్య అందించాడని సమాచారం.
మైసూరులో పునీత్ అమ్మాయిల విద్య కోసం శక్తి ధామ అనే అతిపెద్ద స్వచ్చంద సంస్థని నడుపుతున్నాడని తెలుస్తుంది.పునీత్ మరణంతో అందరిలో విషాద ఛాయలు అలుముకున్నాయని తెలుస్తుంది.. కానీ పునీత్ వ్యక్తిత్వం గురించి అందరికి తెలిసింది కొంత మాత్రమేనట తాను ఉన్నా లేకున్నా సేవాకార్యక్రమాలు ఆగకూడదని పునీత్ భావించాడని తెలుస్తుంది.
తాజా సమాచారం మేరకు పునీత్ సేవా కార్యక్రమాల కోసం ఏకంగా రూ 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు సమాచారం.ఈ విషయం తెలుసుకుని పునీత్ గొప్ప హృదయానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారట.
పునీత్ మరణం తర్వాత సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి వెళుతూ కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారని తెలుస్తుంది.. ఇటీవల సూర్య పునీత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. తెలుగులో చిరంజీవి మరియు ఎన్టీఆర్, బాలయ్యలతో పునీత్ కు ప్రత్యేక అనుబంధం ఉందని తెలుస్తుంది.
పునీత్ చివరగా యువరత్న చిత్రంలో నటించాడని తెలుస్తుంది. సాయేషా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిందని ఈ మూవీ తెలుగులో కూడా విడుదలయిందని సమాచారం.పునీత్ ఈ చిత్రం కోసం తెలుగులో జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడని తెలుస్తుంది.