ఆ పని చేయడం నావల్ల కాదు అంటున్న విజయ్ దేవరకొండ..!

Divya
అప్పట్లో ఎక్కువగా దర్శక, నిర్మాతలు, హీరోలు సినిమా అయిపోయిన వెంటనే ఎవరి ప్రయాణం వారు చూసుకునే వారు. ఈ మధ్య కాలంలో దర్శకులు కూడా నిర్మాతలుగా మారి పోయారు. ఇక వీరితో పాటు హీరోలు కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రొడ్యూసర్స్ అంటే కేవలం డబ్బు పెట్టే వాళ్ళు అని అనుకునేవారు. కానీ వారికి ఎంత పెన్షన్ ఉంటుందో ప్రస్తుతం ఇప్పుడు మన హీరోలకు అర్థం అవుతోంది.


ఎందుకంటే వారు కూడా నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు కనుక ఆ బాధలను కూడా మన హీరోలు కొంతమంది అనుభవిస్తున్నారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. విజయ్ మాట్లాడుతూ హీరోగా తను కొంత దూరం ప్రయాణించాను, ఆ తరువాత బిజినెస్ ల పైన దృష్టి పెట్టాను, ఆ తర్వాత బ్రాండ్ రంగంలో కూడా నన్ను రాణించారు అలా రాణించడానికి ముఖ్యకారణం అభిమానులే అని తెలియజేశాడు. ఇక ఇప్పుడు కూడా స్టార్ హీరో అయినప్పటికీ కూడా కొంతమంది ప్రొడక్షన్ రంగం వైపు అడుగు వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. అయినా సరే నేను మీ మీద నమ్మకంతోనే ఈ బ్యానర్ స్థాపించి అని చెప్పుకొచ్చాడు.


ఈ బ్యానర్ పైనే నా తమ్ముడు సినిమాని నిర్మించాను అని చెప్పుకొచ్చాడు. ఇక పుష్పకవిమానం సినిమాని  విజయ్ దేవరకొండ బాగా పాపులర్ చేయడం వల్ల ఇది జనాల్లో అందరి నోట నానుతోంది. పుష్పక విమాన ఫ్రీ రిలీజ్ వేడుకల్లో ఈ మాటలన్నీ మాట్లాడాడు విజయ్. ఇక ప్రొడక్షన్ విషయంలో తన ఎన్నో కష్టాలు పడ్డాం అని కూడా చెప్పుకొచ్చాడు. తన ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నప్పుడు ప్రొడ్యూసర్లు  దొరకక చాలా ఇబ్బందులు పడ్డాను. అలాంటి ఇబ్బందులు మరే ఇతర హీరోలకు రాకుండా ఉండేందుకు నేను ఈ ప్రొడక్షన్ హౌస్ పెట్టానని తెలియజేశాడు. ఇది 24x7 జాబు లాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: