సునీల్ లుక్ పై సెటైర్లు !

Seetha Sailaja
అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘పుష్ప’ మూవీ ప్రమోషన్ ప్రారంభం కావడంతో ఈ సినిమాకు సంబంధించిన పాటలు అదేవిధంగా ఈమూవీకి సంబంధించిన వివిధ పాత్రల లుక్స్ విడుదల చేస్తున్నారు. ఈమూవీలో సునీల్ నెగిటివ్ టచ్ లో ఉండే ఒక పాత్రలో నటిస్తున్నాడు అంటూ ఇప్పటికే లీకులు వచ్చాయి.


ఆ లీకులను ఖరార్ చేస్తూ లేటెస్ట్ గా విడుదల అయిన ‘పుష్ప’ మూవీలోని సునీల్ లుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు సునీల్ లుక్ పైనే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సునీల్ లుక్ పూర్తిగా ఆర్టిఫిషల్ గా కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఆ తీక్షణమైన చూపులు గాజు కళ్లలో క్రోధం గోల్డ్ షేడ్ ఖద్దరు చొక్కా చేతికి వాచీ మెడనిండా గోల్డ్ సిల్వర్ చైన్స్ చేతి వేళ్లకు ఉంగరాలతో కూడిన సునీల్ లుక్ చూస్తుంటే అతడిలో విలన్ కన్నా కమెడియన్ కనిపిస్తున్నాడు అంటూ జోక్స్ పడుతున్నాయి.


దీనితో సునీల్ గొంతులో గంభీరత చాల తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంత భారీ గెటప్ తో సునీల్ కమెడియన్ గొంతుతో విలన్ డైలాగులు చెపితే సగటు ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న సందేహాలు కొందరకు కల్గుతున్నాయి. అంతేకాదు ఈ లుక్ ఎంత వైలెంట్ గా ఉన్నాసరే సునీల్ వాయిస్ తో కామెడీగా మారుతుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సునీల్ విలన్ పాత్రకు సరిపోడు అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


దర్శకుడు సుకుమార్ చేతిలో ఒక నటుడు పడిన తరువాత ఆ నటుడుని లుక్ పరంగా నటన పరంగా పూర్తిగా మార్చివేస్తాడు. అంతేకాదు ప్రతి సీన్ ను తాను నటించి చూపించి ఆ ఎఫెక్ట్ వచ్చేదాకా ఆ నటుడుని వదలడు. దీనితో సునీల్ పాత్ర విషయంలో సుకుమార్ ఎదో ఒక మ్యాజిక్ చేసి ఉంటాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఎలా ఉన్న ‘పుష్ప’ పాటలు ఎక్కడ చూసినా సందడి చేస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: