అఖండ సినిమా ఓటిటి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరైన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెర కెక్కిన అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసి సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమా లో బాలకృష్ణ రైతు గా, అఘోరా గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో లను చిత్ర బృందం  ఇప్పటికే విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమా పై ఉన్న అంచనాలు పెంచేశాయి, ఇలా ఎన్నో అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.


 ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి నట సింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇది మూడో సినిమా, ఇ ది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.  ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు గా నిలవడం తో ఈ సినిమా  త్రియేటికల్ రైట్స్ బిజినెస్ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్రియేటికల్ బిజినెస్ తో పాటు అఖండ సినిమా ఓటిటి రైట్స్ కూడా భారీ మొత్తం లో అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఓటిటి రంగం చాలా స్పీడ్ గా ముందుకు దూసుకుపోతున్న కారణం గా మరియు జనాలు కూడా ఓటిటి లలో సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపడం వల్ల ఈ సంస్థలు కూడా సినిమా లను భారీ మొత్తాలు వెచ్చించి కొనుక్కుంటున్నారు. అయితే ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్  భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: