బాలయ్యకు బాగా నచ్చిన 'అఖండ'.. బోయపాటికి మరో ఆఫర్..!!

Anilkumar
నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అఖండ'. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మొత్తం ఏడు ఫైట్లు ఉంటాయట. ఒక్కో ఫైట్ సీన్ రెండు నిమిషాలకు పైగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఏకంగా ఐదు నిమిషాలు ఉంటుందట. బాలయ్య సినిమా అంటేనే కంప్లీట్ యాక్షన్. కాబట్టి అఖండ లో అది కావలసినంత ఉందట. మరి ఈ రేంజ్ లో ఫైట్లు ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవడం గ్యారెంటీ అని అభిమానులు అంటున్నారు.


 గతంలో బోయపాటి బాలయ్య కాంబోలో సింహా, లెజెండ్ వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలయ్య మరోసారి ఒక యాక్షన్ ఫిలిం చేయాలని బోయపాటిని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే తాజాగా 'అఖండ' ఫస్ట్ కాపీ వచ్చింది. బాలయ్య సినిమా చూసుకున్నాడు. సినిమా బాలయ్యకు బాగా నచ్చేసింది. దీంతో వెంటనే బోయపాటికి మరో ఆఫర్ ఇచ్చాడట. అఖండ విడుదల తర్వాత మళ్లీ తనతో ఓ సినిమా చేయాల్సిందిగా బాలయ్య.. బోయపాటి కి ఆర్డర్స్ పాస్ చేశాడట. కాకపోతే బోయపాటి మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్టు అల్లుఅర్జున్ తో ప్లాన్ చేశాడు. ఆ సినిమా కోసం కనీసం ఒక సంవత్సరం అయినా పని చేయాల్సి ఉంటుంది.


 ఈ నేపథ్యంలో వెంటనే బాలయ్య తో మరో సినిమా అంటే కుదరని పని. కానీ బాలయ్య మాత్రం బోయపాటి మాట అసలు వినట్లేదట. కచ్చితంగా చేయాల్సిందే అని అంటున్నారట. మరి ఇప్పుడు బోయపాటి ఏం చేస్తాడో చూడాలి. అయితే అఖండ సినిమా బాలయ్యకు బాగా నచ్చింది సరే.. ఇంతకీ ఆ సినిమా విడుదల తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. బాలయ్యకు నచ్చినట్టే ప్రేక్షకులకు కూడా నచ్చితే వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ పడ్డట్టే. అప్పుడు ఖచ్చితంగా బోయపాటి బాలయ్య తో సినిమా చేస్తాడు. మొత్తానికి బాలయ్య-బోయపాటిల కాంబోలో మరో ప్రాజెక్ట్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయన్న మాట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: