నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం : సమంత
అయితే సమంత ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా నాగచైతన్యతో విడాకుల సంబంధించిన ప్రశ్నలు ప్రతిసారి ఎదురవుతూ ఉండటం గమనార్హం. ఇకపోతే నాగచైతన్యతో విడాకుల తర్వాత అటు సినిమాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. అదే సమయంలో సమంత ఇటీవలి కాలంలో రెమ్యూనరేషన్ కూడా పెంచింది అన్న టాక్ వినిపించింది. అంతేకాదు ఇక అటు సోషల్ మీడియా వేదికగా సమంతా పెడుతున్న పోస్టులు కూడా ఎక్కువగా వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఇటీవలే సమంత తన స్నేహితురాలు డాక్టర్ మంజుల పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకకు హాజరై ఉంది.
సమంత హాజరైన ఈ బర్త్ డే వేడుకకు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా హాజరు కావడం గమనార్హం. అయితే బర్త్ డే పార్టీలో జరిగిన ఒక ఫోటోని సమంత ఇటీవలే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఈ క్రమంలోనే డాక్టర్ మంజులను ఉద్దేశిస్తూ ఎన్నో ఎమోషనల్ కామెంట్స్ చేసింది సమంత. నీలాంటి స్నేహితురాలు నా జీవితం లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నా.. కష్ట సమయంలో నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది అని అంటూ ఉంటారు.. ఇక నీ కంటే నిజమైన ఫ్రెండ్ నా జీవితంలో ఎవరు లేరు డాక్టర్.. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను హ్యాపీ బర్త్ డే అంటూ డాక్టర్ మంజుల కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది సమంత.