తల్లి బాధపడ్డేలా ప్రభాస్ ఏం చేసాడో తెలుసా..?
పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ వాళ్ళ అమ్మ శివకుమారిని మాత్రం ఓ విషయంలో తెగ విసిగిస్తున్నాడట. అంతేకాదు ఆమె మాట వినకుండా బాధపెడుతున్నారట. దీంతో వాళ్ళ అమ్మగారు సన్నిహితుల దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అసలు ప్రభాస్ వాళ్ళ అమ్మ అంత బాధపడేలా ఏం చేసారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ప్రభాస్ ను పెళ్లి చేసుకోమని చెప్పిన వాళ్ల అమ్మకు ఆయన ఆన్సర్ విని కన్నీళ్ళు వచ్చేశాయంటే ఆ విషయంలో ఆమె ఎంతలా బాధపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అనేది అందరి కోరిక. ఆ రోజు కోసం అభిమానులు కొన్ని ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. మొదట్లో బాహుబలి సినిమా కంప్లీట్ అయ్యాక చేసుకుంటా అని చెప్పిన ప్రభాస్ ఆ తరువాత ఆ ఊసే మర్చిపోయాడు. ఇంట్లో వాళ్లు అడిగితే పెళ్లి చేసుకుంటా..కానీ కొంచెం టైం ఇవ్వండి అని అదిగేవారట. కానీ ఇప్పుడు వాళ్ల అమ్మ అడుగుతుంటే తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అయిపోయాకనే పెళ్లి చేసుకుంటా అని గట్టిగా చెప్పుతున్నారట. ఈ లెక్కన ఆయన పెళ్లి చేసుకోవాలంటే మరో 3-4 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది. దీంతో వాళ్ల అమ్మ ఏం చేయలేక కృష్ణం రాజుని రంగంలోకి దించిన్నట్లు తెలుస్తుంది. ఇక అంతా పెద్దాయనే చేతిలోనే ఉంది..ప్రభాస్ ను ఎలాగొలా ఒప్పించి త్వరగా పెళ్లి చేయండి అంటున్నారు ఆయన అభిమానులు. మరి చూడాలి ప్రభాస్ ఏం చేస్తాడో..!!