బాలయ్యతో అనిల్ రావిపూడి మూవీ కన్ఫార్మ్! టైటిల్ ఇదే!!
ఇక అనీల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈనెల చివరి వరకు ఎఫ్ 3 సినిమాని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వెంకటేష్ ఇంకా వరుణ్ తేజ్ లు హీరోలుగా మెహ్రీన్ ఇంకా తమన్నాలు హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కమెడియన్ సునీల్ ఇంకా రాజేంద్ర ప్రసాద్ లు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎఫ్ 2 మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం ఇక ఆ తర్వాత అనిల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ లాంటి బిగ్ స్టార్ హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా రికార్డులు తిరగరాసిన సినిమాగా విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఎఫ్ 3 సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ ని దక్కించుకుంటే ఖచ్చితంగా బాలకృష్ణ సినిమా కు మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి బాల కృష్ణతో ఎఫ్ 3 వంటి ఒక మంచి మాస్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు అనిల్ రావిపూడి వున్నాడనే వార్తలు వస్తున్నాయి.