సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కు ఒకప్పుడు తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదని అందరికి తెలిసిన విషయమే.అదేంటి ఒకప్పుడు అనే మాట వాడుతున్నాడు అని అనుకుంటున్నారా.ఇప్పుడు అస్సలు లేదా ఏమిటి a అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి లేదు అనే మాటకంటే చాలా వరకు తగ్గిపోయింది అంటే కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది.ఈ ఒక్క మాట మాత్రం నిజమే అని అనిపిస్తుంది.ఒకప్పుడు రజినీ సినిమా రిలీజ్ అంటే తెలుగురాష్ట్రాల్లో కూడా పండుగ వాతావరణం ఏర్పడేదని అందరికి తెలుసు.అంతేకాకుండా మన స్టార్ హీరోల సినిమాలను కూడా తలదన్నేలా అవి ఉండేవని ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలుసు.. కానీ కాలక్రమేణ అది తగ్గుతూ వస్తోందని తెలుస్తుంది.
'కబాలి' వరకు రజినీ క్రేజ్ ఇక్కడ బాగానే ఉందని తెలుస్తుంది.. ఆ చిత్రం తెలుగులోనే రూ.22 కోట్ల వరకు షేర్ ను రాబట్టిందని సమాచారం.. కానీ అటు తర్వాత వచ్చిన 'కాలా' 'పేట' 'మరియు దర్బార్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యాయని తెలుస్తుంది.. '2.0' పూర్తిగా రజినీ సినిమా అనలేమని తెలుస్తుంది.శంకర్ ఇమేజ్ కూడా మిక్స్ అయ్యి ఉంది కాబట్టి అది ఆయన అకౌంట్ కి వెళుతుంది.ఇక ఇటీవల విడుదలైన 'పెద్దన్న' సినిమా అయితే మరీ ఘోరమని చెప్పవచ్చు.రజినీతో పాటు కీర్తి సురేష్ మరియు నయనతార వంటి స్టార్ క్యాస్ట్ ఉన్నా కూడా జనాలు ఈ చిత్రాన్ని చూడడానికి థియేటర్లకు వెళ్లలేకపోయారని సమాచారం.
రూ.12 కోట్లకు బయ్యర్స్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేస్తే కనీసం ఇంకా రూ.4 కోట్ల షేర్ ను కూడా వసూల్ చేయలేకపోయిందని తెలుస్తుంది.ప్రమోషన్లు లేకనో లేక మిక్స్డ్ టాక్ వల్లనో కానీ ఈ సినిమాని జనాలు పట్టించుకోలేదని తెలుస్తుంది. చెప్పాలంటే 'కబాలి' 'కాలా' అంత ఘోరంగా అయితే 'దర్బార్' కానీ 'పెద్దన్న' కానీ లేవని చెప్పవచ్చు. దీనిని బట్టి రజినీ సినిమాలను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మరచిపోయారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది.