టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోలుగా నట వారసులు రావడం కొత్తేమీ కాదు. ఓ వైపు నెపోతిజం అని అంటున్నా కూడా ఇండస్ట్రీ లో వారసుల రాక ఏమాత్రం తగ్గడం లేదు. వచ్చే హీరో లలో టాలెంట్ ఏమైనా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు లేదంటే ఇప్పటికే తెరపైకి వచ్చిన వారిలా నార్మల్ హీరోలుగా ఉంటూ ఏమాత్రం ఎదగలేకపోతారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు స్టార్ హీరోలుగా ఎదిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరిలో అయినా టాలెంట్ ఉంటే ఎవరినైనా తప్పకుండా ఆదరిస్తారు లేదంటే ఇంటికి పంపిస్తారు.
తాజాగా తెలుగు సినిమాలలోకి మరొక నటవారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తుంది. రవితేజ తనయుడు మహా ధన్ హీరోగా త్వరలోనే టాలీవుడ్ కు పరిచయం కాబోతు ఉండగా ఈ బాధ్యతలను హరీష్ శంకర్ కు అప్పగించడను తెలుస్తుంది రవితేజ. మొదటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఆ క్రమంలోనే కష్టాల్లో ఉన్నప్పుడు హరీష్ శంకర్ ను రవితేజ చాలాసార్లు ఆదుకున్నాడు. ఆయనతో కలిసి ఇప్పటివరకు రెండు సినిమాలు చేసిన నేపథ్యంలో రవితేజ వాటితో మంచి హిట్ అందుకున్నాడు.
రాజా ది గ్రేట్ సినిమాలో హీరో చిన్నప్పుడు పాత్రలో మహాధన్ న టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించిన ఆయన మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకొని మరి ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలు పాల్గొన్నాడు. బాలనటుడిగా తండ్రి సినిమాలో కనిపించిన మహా ఇప్పుడు హీరో గా తెరపైకి రావడం రవితేజ అభిమానులు ఎంతగానో సంతోష పరుస్తుంది. మరి తన ప్రతిభను అంతా చూపించి ప్రేక్షకులను తన తండ్రి లాగే ఎదుగుతాడా అనేది చూడాలి. మరో వైపు రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉన్నాడు. కిలాడి సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిన క్రమంలో ఆయన ఏకంగా మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్లి అందరు హీరోలు ఆశ్చర్య పరుస్తున్నాడు. మరి భవిష్యత్తులో రవితేజ నుంచి ఎలాంటి సినిమాలలో తలపై చూడబోతే ఏమో చూద్దాం.