ఆర్ ఆర్ ఆర్ నాటు పాట పై విమర్శలు !
ఈ పాట విడుదలైన కొన్ని గంటలలోనే ట్రెండింగ్ గా మారిపోయింది. ఈ పాట పై పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ ఈ పాటను ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాటలో జూనియర్ చరణ్ లు వేసిన మాస్ స్టెప్స్ వారి అభిమానులకు పండుగగా మారింది. ఇది అంతా నాణానికి ఒకవైపు.
‘ఆర్ ఆర్ ఆర్’ మూల కథ 19వ శతాబ్దం తొలి రోజులకు సంబంధించింది. అలాంటి కాలంలో ఒక ఉత్తరాది ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ లు ఒకచోట అనుకోకుండా కలిసినప్పుడు ఏమి జరిగింది అన్న ఊహ చుట్టూ ఈకథ అల్లబడింది. తెలుగు రాష్ట్రాలలో స్వాతంత్ర సమరయోదులుగా అల్లూరికి అదేవిధంగా కొమరం భీమ్ కు విపరీతమైన ఆదరణ ఉండటమే కాకుండా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో వీరిద్దరినీ అక్కడి గిరిజనులు దేవుడుగా ఆరాధిస్తూ ఉంటారు.
అలాంటి ఉదాత్తమైన నేపధ్యం గల వీరిద్దరి పాత్రలతో సినిమాలు తీస్తున్న రాజమౌళి వీరి పాత్రల స్వభావంతో సంబంధం లేకుండా ఈ పాత్రల చేత మాస్ స్టెప్స్ వేయించడం ఏమిటి అంటూ కొందరు విశ్లేషకులు విమర్శలు కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమరం భీమ్ సామాజిక వర్గానికి చెందిన కొందరు తమ నాయకుడి పాత్రను ఎటువంటి చారిత్రక ఆధారాలు లేకుండా ఊహాజనిత పాత్రగా ‘ఆర్ ఆర్ ఆర్’ లో చూపిస్తే తాము అంగీకరించము అని చెపుతున్న ప్రస్తుత పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ చారిత్రాత్మిక సినిమాగా రాజమౌళి తీస్తున్నాడా లేకుంటే చారిత్రాత్మిక ముసుకులో ఒక పక్కా మాస్ సినిమాను నిర్మిస్తున్నాడా అన్న సందేహాలు కలగడం సహజం..