సుకుమార్ టెన్షన్ తో అల్లు అర్జున్ కన్ఫ్యూజన్ !
‘పుష్ప’ మూవీ పై భారీ అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనికితోడు ఈమూవీలోని పాటలు ఇప్పటికే అందరికీ బాగా నచ్చడంతో ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈమూవీ డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు సూపర్ హిట్ అవ్వడంతో ఈమూవీ అల్లు అర్జున్ కెరియర్ లోనే బ్లాక్ బష్టర్ హిట్ గా మారుతుంది అన్న అంచనాలు మార్కెటింగ్ వర్గాల నుంచి వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి సంబంధించి ఇప్పుడు బయటకు వచ్చిన ఒక లీక్ బన్నీ అభిమానులకు కలవరపాటుకు గురిచేస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న ఈ లీకుల ప్రకారం ‘పుష్ప’ మూవీకి సంబంధించి ఇంకా కొంత టాకీ పార్ట్ షూటింగ్ కొంత మిగిలి ఉందని తెలుస్తోంది. అదేవిధంగా ఈమూవీకి సంబంధించిన ఒక పాట చిత్రీకరణ కూడ మిగిలి ఉంది అంటున్నారు.
డిసెంబర్ 17న విడుదల కాబోతున్న ఈమూవీ విడుదలకు ఇక కేవలం 5 వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో సుకుమార్ ఇన్ని పనులు ఈమూవీ రిలీజ్ లోపు పూర్తి చేయగలడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ఈసినిమాకు సంబంధించిన చిన్నచిన్న సన్నివేశాల చిత్రీకరణను తన అసిస్టెంట్స్ ద్వారా షూట్ చేయిస్తూ వీడియోకాల్స్ ద్వారా ఆ షూటింగ్ ను సుకుమార్ పర్యవేక్షిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం సుకుమార్ ఈ మూవీ ఎడిటింగ్ వర్క్ పై పూర్తి శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్ తాను తీసే ప్రతి సన్నివేశాన్ని రకరకాల యాంగిల్స్ లో డిఫరెంట్ షాట్స్ లో తీయడం సుకుమార్ కు అలవాటు. వాటిలోంచి ఎడిటింగ్ టైంలో బెస్ట్ షాట్ ఎంచుకుని మిక్సింగ్ చేయిస్తూ ఉంటాడు. దీనితో సుకుమార్ కు ఎడిటింగ్ లోనే చాలసమయం పడుతుంది. దీనికితోడు ఈమూవీలోని సంభాషణలు అన్నీ చిత్తూరు యాసలో సాగే పరిస్థితులలో ఈమూవీ డబ్బింగ్ విషయంలో సుకుమార్ కు చాలసమయం పడుతున్న పరిస్థితులలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని పనులు సుకుమార్ ఎలా పూర్తి చేస్తాడు అంటూ బన్నీ అభిమానులు ఖంగారుగా ఉన్నారు..