దర్శకుడు శ్రీను వైట్ల తెలుగు నాట కామెడీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతో ట్రెండ్ క్రియేట్ చేసి తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకుల సరసన చేరాడు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన దూకుడు సినిమాతో ఎన్నో తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ల లిస్టులో చేరిపోయాడు. అలాంటి ఈ దర్శకుడు ప్రస్తుతం మాత్రం వరుస పరాజయాలతో డీలా పడిపోయాడు. ఇది ఇలా ఉంటే దర్శకుడు శ్రీను వైట్ల తాజాగా ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా షో కు విచ్చేశాడు. అయితే ఈ షో లో భాగంగా శ్రీను వైట్ల అనేక విషయాలను తెలియజేశారు. అందులో భాగంగా శ్రీను వైట్ల దర్శకుడిగా మారే ప్రయత్నంలో చేసిన ప్రయత్నాల గురించి తెలియజేశారు...
శ్రీను వైట్ల మాట్లాడుతూ... నేను మొదటగా ప్రాణానికి ప్రాణం సినిమా కు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను.
అలా నా ప్రయాణం మొదలు అయ్యింది. ఆ సినిమా బాగా ఆడలేదు. ఆ సినిమా బాగా ఆడకపోవడంతో మళ్ళీ నా పరిస్థితి మొదటికి వచ్చింది. ఆ సినిమా తర్వాత నేను సాగర్ గారి దగ్గర, ఈవీవీ దగ్గర పని చేసి నిలదొక్కుకున్నాను. ఆ తర్వాత దర్శకుడిగా మారాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు మొదలు పెట్టాను. రాజశేఖర్ హీరోగా అపరిచితుడు అనే సినిమాను తెరకెక్కించడానికి అంతా సిద్ధం చేసుకున్నాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అప్పుడు కొంత మంది ఒక టీమ్ గా ఏర్పడి ఒక సినిమా చేద్దామంటే రవితేజ హీరోగా 'నీ కోసం' మూవీ ని చేశాను. ఆ మూవీ బడ్జెట్ 38 లక్షలు .. 28 రోజుల్లో తీశాను. ఆ మూవీ బాగా వచ్చిందని తెలిసి రామోజీరావు గారు కొనేసి రిలీజ్ చేశారు. ఆ మూవీ కి 7 నంది అవార్డులు వచ్చాయి. నీకోసం సినిమా నచ్చడం వల్ల రామోజీరావు గారు నాకు ఆనందం మూవీ ని చేసే అవకాశం ఇచ్చారు అని శ్రీను వైట్ల తెలియజేశారు.