దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాలలో హీరోలను, విలన్ లను ఎంత వైవిధ్యంగా చూపిస్తాడో మన అందరికీ తెలిసిందే. రాజమౌళి సినిమాలో నటించిన తర్వాత వారికి గొప్ప పేరు రావడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఒక గొప్ప పాత్ర చేశాడు అన్న పేరు కూడా వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాజమౌళి తన సినిమాల్లో విలన్ కూడా చాలా రౌద్రంగా, గంభీరంగా, భయంకరంగా చూపిస్తూ ఉంటాడు. రాజమౌళి సినిమాలో విలన్ గా నటించిన తర్వాత వేరే ఏ సినిమాలో కూడా అంత ఇంపాక్ట్ కనబడకపోవడం అనేక మంది నటులలో ఇది వరకే చూశాం. రాజమౌళి తన సినిమాల్లో హీరోగా నటించిన వారికి కూడా ఇలాంటి అనుభవాలే అనేకం ఎదురయ్యాయి. రాజమౌళి తన సినిమాలలో హీరోలు చూపించిన విధంగా వారి తదుపరి సినిమాలో కనిపించక పోవడం వల్ల అనేక హీరోలు రాజమౌళి సినిమా తర్వాత పరాజయాలను చూశారు.
ఇది ఇలా ఉంటే రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమా లో విలన్ గా నాగినీడు అలరించాడు. తాజాగా నాగినీడు ఆలీతో సరదాగా పోగ్రామ్ కు సంబంధించిన ఒక ప్రోమోను ఆలీతో సరదాగా నిర్వహణ బృందం విడుదల చేసింది. ఈ ప్రోమో లో నాగినీడు 'మర్యాద రామన్న' సినిమా తో పేరు, క్రేజ్, ఆఫర్లు ఎన్నో వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం అంతటి పాత్ర రాలేదు. అలాంటి సక్సెస్ కూడా రాలేదు. ఎవరికి ఫోన్ చేసి అడిగినప్పటికీ కూడా నాగినీడు కు ఒక పాత్ర ఇస్తున్నాము అంటే దానికంటూ ఒక ప్రత్యేక స్థాయి ఉండాలి. ఆ పాత్రను కేవలం నాగినీడు మాత్రమే చేయగలిగి ఉండాలి. అలాంటి పాత్రలను మేము రావడం లేదు. రాసినప్పుడు కచ్చితంగా చెబుతాం అని అనేవారట. అలా మూవీ అవకాశాలు ఏవి రాలేదట. ఒక విధంగా చెప్పాలంటే మర్యాదరామన్న నా కెరీర్ ను నాశనం చేసినట్టు అని నాగినీడు చెప్పుకొచ్చారు. మర్యాద రామన్న సినిమా నన్ను పిక్స్ లో నిలబెట్టింది అని నాగినీడు అన్నారు.