అలీ నటించిన ఆ సినిమా చూసి స్టార్ హీరోలు సైతం షాక్ తిన్నారట...!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లలో అలీ ఒకరని అందరికి తెలుసు.తెలుగులో 1100కు పైగా సినిమాలలో నటించిన అలీ తన సినీ కెరీర్ లో ఎన్నో రికార్డులను మరియు అవార్డులను సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.

పేద కుటుంబంలో జన్మించిన అలీ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తిని పెంచుకుని బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారని సమాచారం.బాలనటుడిగా అలీ సక్సెస్ సాధించడంతో ఆ తరువాత కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుని అలీ కెరీర్ ను కొనసాగించారని తెలుస్తుంది..

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో అలీ ఎక్కువగా నటించారని అందరికి తెలుసు. పలు సినిమాలలో అలీ హీరోగా నటించడం విశేషం.అలీ హీరోగా నటించిన సినిమాలలో యమలీల ఒకటి కాగా సోషియో ఫాంటసీ సినిమాగా యమలీల తెరకెక్కడం ఆ రోజుల్లో అదే ట్రెండ్ అని తెలుస్తుంది. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందట అయితే ఈ సినిమాతో అలీ స్టార్ హీరోలకు షాక్ పుట్టించారట  

మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అలీకి మంచి పేరు తెచ్చిపెట్టిందని తెలుస్తుంది.

తొలిరోజు యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న యమలీల ఆ తర్వాత పుంజుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లను సంపాదించుకుందని తెలుస్తుంది.. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని నిర్మాతలకు భారీ లాభాలను అందించిందట.ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారనే చెప్పవచ్చు  
సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం విశేషం.. కృష్ణారెడ్డి కోరిక మేరకు యమలీలలో ఒక పాటలో నటించడానికి కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అయితే ఈ సినిమాకు అటూఇటుగా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజైనా ఆ సినిమాలను ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని తెలుస్తుంది.. కథాబలంతో హిట్టైన ఈ సినిమా ఏకంగా 12 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిందని ఈ సినిమా బడ్జెట్ కేవలం 75లక్షల రూపాయలే అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: