పూజ హెగ్డే సందేశాలకు షాక్ అవుతున్న టాప్ దర్శకులు !
ఇప్పుడు ఈ ట్రెండ్ ను పూజా హెగ్డే బాగా క్యాష్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్. ఆమె డేట్స్ ఇస్తే చాలు ఆమెకు 3కోట్ల వరకు పారితోషికం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కొనసాగుతున్న తన మ్యానియాను గ్రహించిన పూజ కూడ టాప్ హీరోలతో వచ్చిన అవకాశాలు అన్నీ వినియోగించుకుంటూ ప్రస్తుతం నెంబర్ వన్ గా కొనసాగుతోంది.
దీనితో అనేకమంది టాప్ దర్శకులు తమ దగ్గర ఉన్న కథలు వినమని పూజ హెగ్డే తో రాయబారాలు చేస్తున్నారు. అయితే పూజ తన దగ్గరకు వస్తున్న కథలు అన్నీ వినకుండా మంచి ఐటమ్ సాంగ్స్ ఉంటే తాను నటించడానికి అభ్యంతరం లేదు అంటూ తన టీమ్ ద్వారా లీకులు ఇస్తున్నట్లు టాక్. ఈ లీకులకు టాప్ దర్శకులు కూడ ఆశ్చర్య పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఐటమ్ సాంగ్స్ పై పూజ మనసు పడటానికి ఒక కారణం ఉంది అంటున్నారు. ఒక భారీ సినిమాలో పూజ హీరోయిన్ గా నటిస్తే 2.5 కోట్ల వరకు పారితోషికం వస్తుంది. అయితే కనీసం ఆ సినిమా గురించి మూడు నెలలు పైగా కష్టపడాలి. అదే ఐటమ్ సాంగ్ అయితే నాలుగు రోజుల నుంచి ఆరు రోజులు కష్టపడితే చాలు ఆమెకు 75 లక్షల వరకు పారితోషికం వస్తుంది కాబట్టి పూజ కు ఈ ఆలోచన వచ్చి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ‘ఆచార్య’ మూవీలోని నీలాంబరి పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు కాబట్టి తాను ఆ పాత్ర చిన్నది అయినా నటించానని ఆమె చెపుతోంది..