ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్...!
రెబల్ స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారని ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ప్రభాస్ గురించి వరుస ట్వీట్లు చేస్తూ ప్రభాస్ అభిమానులను సందడి చేశారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ప్రభాస్ ఫోటోలను షేర్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయని సమాచారం.
ధర్మం మార్కెట్ లో దొరకదు బ్రదర్ అంటూ అది బ్లడ్ లో ఉండాలి అది ఇక్కడ నిండుగా ఉంది అమెరికా వెళ్లినవారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మరియు ఇండియా వచ్చినవారు ప్రభాస్ సినిమా చూడకుండా ఉండరు అంటూ ప్రభాస్ గురించి చేసిన ట్వీట్ వైరల్ గా మారిందని తెలుస్తుంది.అదేవిధంగా పట్టాభిషేకానీకి వెళ్తున్న అశోకచక్రవర్తిలా మహాభారతంలో యుద్ధానికి బయలుదేరుతున్న అర్జునుడిలా ఉన్నాడంటూ ప్రభాస్ గురించి వరుస ట్వీట్లు చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఎంతో ఆనందం వ్యక్తం చేశారని తెలుస్తుంది.ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని త్వరలోనే ఆది పురుష్, సలార్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని అంటూ బండ్ల గణేష్ ప్రభాస్ గురించి చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయని తెలుస్తుంది.