సమంత దూకుడులో ఆంతర్యం !
ప్రస్తుతం టాలీవుడ్ కు సంబంధించి సమంత చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ ‘శాకుంతలం’ మూవీ మాత్రమే అయితే ఇలాంటి సబ్జెక్ట్ ను నేటితరం ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అన్న విషయమై కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగానే భేదాభిప్రాయాలతో చైతన్యా సమంతలు విడిపోయిన సంఘటన తరువాత సమంత తన కెరియర్ కు సంబంధించి మరింత వేగాన్ని పెంచింది.
ప్రస్తుతం ఆమె తెలుగులో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్నప్పటికీ ఆమె దృష్టి అంతా మళ్ళీ టాప్ యంగ్ హీరోల సినిమాలలో ఎలా నటించాలి అన్న ఆలోచనలలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి తమన్నా కాజల్ నయనతార లాంటి క్రేజీ హీరోయిన్స్ కెరియర్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలకు పూజా హెగ్డే రష్మికలు తప్ప మరొక ఆప్క్షన్ లేదు.
సెంటిమెంట్ పరంగా టాప్ హీరోలు అందరితోను హిట్స్ కొట్టిన రికార్డు సమంతకు ఉంది. అయితే ఆమె అక్కినేని కుటుంబ కోడలు అయిన తరువాత ఆమెతో నటించడానికి టాప్ యంగ్ హీరోలు పెద్దగా ఆశక్తి కనపరచలేదు. ఇప్పుడు ఆ బంధం తెగిపోయింది కాబట్టి తిరిగి మళ్ళీ టాప్ యంగ్ హీరోలు సమంత కు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉంది అంటూ ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి వచ్చే ఏడాది మహేష్ తో తీయబోయే భారీ బడ్జెట్ మూవీలో సమంతకు అవకాశం దక్కుతుందని ఇప్పటికే ఈవిషయమై సమంత రాజమౌళి తో వ్యూహాత్మక రాయబారాలు చేసే విధంగా ఆమె అడుగులు పడుతున్నాయి అంటూ జరుగుతున్న ప్రచారం నిజం అయితే సమంత కెరియర్ కు తిరుగులేదు అనుకోవాలి..