ఆయన రుణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ అవుతున్న మెగాస్టార్..!!

Divya
మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ,తన కంటూ ఒక ప్రత్యేకమైన స్టార్డం ను సంపాదించుకున్నారు.. ఇకపోతే ఆయన ఒకరి రుణం తీర్చుకోలేను అంటూ తాజాగా ఎమోషనల్ అయిన విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఆయన ఎవరో కాదు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి.. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీత దర్శకుడిగా నిర్వహించి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన ఘనత మ్యూజిక్ డైరెక్టర్ కోటి కి ఉందని చెప్పవచ్చు.. ఇదిలా ఉండగా కోటి కొడుకు రాజీవ్ హీరోగా ఈ మధ్య కాలంలోనే వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
సంగీత దర్శకుడు కోటి కొడుకు రాజీవ్ హీరోగా.. ప్రముఖ నటి వాణి విశ్వనాథ్ కూతురు వర్ష హీరోయిన్ గా.. మొదటిసారి పరిచయం అవుతూ ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నారు. ఇక వీరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 11:11.. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ప్రోగ్రాం నిన్న ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని పార్క్ హయత్ హోటల్ లో చాలా ఘనంగా జరుపుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు..
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... ఈరోజు చాలా మంచి రోజు.. ఈ రోజున నా చిత్రం కూడా ప్రారంభం అయ్యింది.. అంతేకాదు కోటి కొడుకు హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా వేడుకకు నేను హాజరు కావడం చాలా థ్రిల్లింగ్గా, సంతోషంగా కూడా ఉంది.. ఇక నా విజయం వెనుక డైరెక్టర్ కోటి హస్తం చాలా ఉంది అంటూ, ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు.. అంతేకాదు చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు కోటి చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించి , ఆ చిత్రాలను విజయవంతం చేసిన విషయం తెలిసిందే కదా ..! అందుకే కోటి రుణం ఎప్పటికీ తీర్చుకోలేకపోతున్నాను అంటూ ఈ సందర్భంగా ఆయన వెల్లడిస్తూ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు.. కోటి కొడుకును ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది అంటూ చిరంజీవి వెల్లడించడం జరిగింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: