ప్రభాస్ అభిమానులకు శుభవార్త..! స్పెషల్ అప్డేట్ ఇచ్చిన రాధేశ్యామ్ మేకర్స్..
చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు ప్రభాస్. అయితే ఓ వైపు ప్రభాస్ సినిమాలను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నా.. ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదనే నిరుత్సాహంతో అభిమానులున్నారు. ఇటీవలనే ప్రబాస్ అభిమాని రాధేశ్యామ్ సినిమా అప్డేట్ ఇవ్వడం లేదని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. అది జరిగిన మరుసటి రోజునే చిత్రబృందం అప్డేట్ను ప్రకటించడం గమనార్హం.
ఈ తరుణంలోనే ప్రబాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో నటించిన రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని చాలా రోజులు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. రాధేశ్యామ్ చిత్ర నుంచి అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో అభిమానులు గగ్గోలు పెడుతుండడంతో తాజాగా ప్రభాస్ అభిమానులకు రాధేశ్యామ్ చిత్ర యూనిట్ దిగి వచ్చింది.
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ విడుదల చేసే సమయాన్ని, తేదీని ప్రకటించి అభిమానులను కాస్త ఖుసి చేసినది. రాధేశ్యామ్ నుంచి ఈ రాతలే అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ వీడియోను ఈనెల 15న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ తరుణంలోనే ఇంట్రస్టింగ్ పోస్టర్ ను కూడ విడుదల చేసినది. యూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రమునకు కే.రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించినది చిత్ర బృందం.