ప్రభాస్ చేతిలో రాథే శ్యామ్ పవర్ !

Seetha Sailaja

సంక్రాంతి రేస్ ఈసారి రాజమౌళి ప్రభాస్ ల మధ్య అన్న విషయం ఫిక్స్ అయిపోయింది. ‘ఆర్ ఆర్ ఆర్’ మ్యానియాకు భయపడి మహేష్ పవన్ లు వెనకడుగు వేస్తే ఒక్క ప్రభాస్ మాత్రమే రాజమౌళితో వార్ కు రెడీ అవుతున్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ ఇప్పటికే తన ప్రచారంలో ముందుకు దూసుకుపోతూ లేటెస్ట్ గా విడుదలైన ‘నాటు నాటు’ పాటతో ట్రెండింగ్ గా మారిపోయింది.


ఇలాంటి పరిస్థితులలో ‘రాథే శ్యామ్’ కు సంబంధించిన అప్ డేట్స్ ఎందుకు రావడం లేదు అన్న టెన్షన్ లో ప్రభాస్ అభిమానులు ఉన్నారు. ‘రాథే శ్యామ్’ మూవీకి సంబందించిన పాటలలో ఏ ఒక్క పాట ఇప్పటికీ రిలీజ్ కావడంతో అభిమానులు ఈ మూవీ ప్రమోషన్ విషయంలో ఎందుకు వెనకపడిపోతోంది అన్న టెన్షన్ పడుతున్నట్లు టాక్.


అయితే తెలుస్తున్న సమాచారంమేరకు ‘రాథే శ్యామ్’ పబ్లిసిటీ వ్యవహారాలు  అన్నీ ఇప్పుడు స్వయంగా ప్రభాస్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఏ స్టిల్స్ విడుదల చేయాలి అన్నా లేకుంటే ఒక పాటను విడుదల చేయాలి అన్న అది ప్రభాస్ దృష్టికి వెళ్ళి అతడి అంగీకారం పొందిన తరువాత మాత్రమే ఈ మూవీ ప్రమోషన్ కు సంబంధించిన మెటీరియల్ బయటకు వచ్చే విధంగా ప్రభాస్ అన్నీ తన ఆధీనంలో ఉంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమాను జనవరి 14న విడుదల అవుతున్న పరిస్థితులలో డిసెంబర్ 1 నుండి ఈ మూవీ ప్రమోషన్ ను జాతీయ స్థాయిలో ఒకేసారి ప్రారంభించాలని ప్రభాస్ ఆలోచన అని టాక్. అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన కథ క్లైమాక్స్ రెండు రకాలుగా చిత్రీకరించిన పరిస్థితులలో ఏ వెర్షన్ ఫైనల్ చేయాలి అన్న సందిగ్ధంలో కూడ ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడం ప్రభాస్ కెరియర్ కు అత్యంత కీలకం కావడంతో ఈ మూవీ విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదని ప్రభాస్ ఆలోచన అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: