మహేష్ కోసం తన వ్యూహాన్ని మార్చుతున్న రాజమౌళి...!

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దిగ్గజ దర్శకుడు అయిన రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”తో బిజీగా ఉండగ రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదలకు సిద్ధమవుతోందని సమాచారం.

ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తన వ్యూహాన్ని రిపీట్ చేయబోతున్నాడని తెలుస్తుంది.తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం మహేష్ కోసం రాజమౌళి సమంతను రంగంలోకి దింపుతున్నాడని తెలుస్తుంది.అయితే నిజానికి రాజమౌళి తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడని అందరికి తెలుసు.. ఒక్క అనుష్కతోనే రాజమౌళి మూడు సినిమాలు చేశాడని రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విక్రమార్కుడు మరియు బాహుబలి చిత్రాలలో అనుష్క హీరోయిన్ గా నటించిందని తెలుస్తుంది.ఇక గతంలో రాజమౌళి చేసిన ‘ఈగ’ సినిమాలో సామ్ కన్పించిన విషయం అందరికి తెలిసిందే.

ఇప్పుడు మరోసారి మహేష్ మరియు రాజమౌళి కాంబోలో రానున్న సినిమా కోసం హీరోయిన్ గా సమంత పేరు విన్పిస్తుండడం ఆసక్తికరంగా మారిందని తెలుస్తుంది.దానికి రెండు కారణాలు ఉన్నాయని సమాచారం.. ఒకటి రాజమౌళి హీరోయిన్లను రిపీట్ చేయకపోవడం అలాగే రెండోది పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం రాజమౌళి అసలు సౌత్ హీరోయిన్ ను తీసుకుంటాడ అనే అనుమానం కలుగుతుందట. “ఆర్ఆర్ఆర్” సినిమా కోసం బాలీవుడ్ మరియు హాలీవుడ్ భామలను తీసుకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు మహేష్ ప్రాజెక్ట్ కోసం సౌత్ హీరోయిన్ ను తీసుకోవడం అనేది కూడా డౌట్ అని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా గతంలో సమంత మరియు మహేష్ బాబు ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని దూకుడు మరియు బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో వీరిద్దరి జంట ప్రేక్షకులను అలరించిందని తెలుస్తుంది.. మరి మరోసారి వీరు జోడి కడతారా అనేది అనుమానమే.‘ఫ్యామిలీ మ్యాన్-2’తో ఉత్తరాదిన సైతం సమంత మంచి పాపులారిటీని దక్కించుకుందని ఆమె నెక్స్ట్ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయని తెలుస్తుంది.మరి ప్రచారం జరుగుతున్నట్టుగా రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సామ్ ను ఎంచుకుంటాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: