సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పటి వరకు 26 సినిమాలను చేశాడు. 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తుండగా ఆయన 27వ సినిమా గా పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారు పాట అనే సినిమా తెరకెక్కుతుంది. సినిమాల్లోకి బాలనటుడిగా ప్రవేశించి తండ్రి తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన మహేష్ ఆ తర్వాత రాజకుమారుడు అనే సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమై ఇప్పటివరకు ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు.
అయితే ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీసిన మహేష్ బాబు తన కెరీర్ లో ఒక్క సినిమా కూడా రీమేక్ చేయకపోవడం గమమార్గం. ఇతర హీరోలు రీమేక్ చేసి హిట్ ల మీద హిట్ లు సాధిస్తే మహేష్ మాత్రం ఒరిజినల్ కథ లు చేసి చాలాసార్లు చేతులు కాల్చుకున్నాడు. దాంతో మహేష్ బాబు ఎందుకు రీమేక్ సినిమాలు చేయడు అనే అనుమానాలను ప్రశ్నలను అభిమానులు సంధించారు. దానికి ఎప్పుడూ ఆయన సమాధానం చెప్పలేదు. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా తోటి హీరోలు అంత పెద్ద హిట్స్ అందుకున్న కూడా రీమేక్ సినిమాలు చేయకపోవడం ఆయన అభిమానులను ఎంతో నిరాశ పరుస్తుంది
ఈ నేపథ్యంలో మహేష్ తాను రీమేక్ సినిమాలను ఎందుకు చేయదలచుకోలేదొ చెప్పాడు. రీమేక్ సినిమా చేస్తే ఒరిజినల్ హీరోనే ఆ సినిమాలో కనపడతాడు అని అందులో తన స్పెషాలిటీ ఏముంటుందని చెప్పాడు. సినిమాలను రీమేక్ చేయడం నా దృష్టిలో పెద్ద రిస్క్ అని కూడా చెప్పాడు. అందుకే కాబోలు మహేష్ బాబు ఇప్పటి వరకు కూడా రీమేక్ సినిమాలు చేయాలని అనుకోలేదు. ఇకపోతే ఆయన ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. వాటి తర్వాత ఆయనకు ఏ రేంజ్ లో గుర్తింపు లభిస్తుందో చూడాలి.