"కేజిఎఫ్ పార్ట్ 1" ఒక సంచలనం... మరి "కేజిఎఫ్ 2"?
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఒక్క సారిగా ఈ సినిమాను థియేటర్ లో చూసిన ప్రేక్షకులు యశ్ నటన, కథ, యాక్షన్, డైరెక్షన్ ఇలా ప్రతి ఒక్క అంశం ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ 146 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ కెరీర్ ఒక్క సారిగా మారిపోయింది. వరుసగా అగ్ర హీరోలు ఇతనికి అవకాశాలు ఇచ్చారు. ప్రస్తుతం యశ్ తోనే కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కింది.
ఇప్పటికే ఇందులో నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక పక్క ప్రభాస్ తో సలార్ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ట్రైలర్ నుండి సినిమా వరకు కేజిఎఫ్ ఒక చరిత్ర అని చెప్పాలి. ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.