కొంచెం టచ్ లో ఉంటే చెప్తా.. రేంజ్ లో శ్రీముఖి కొత్త షో?
ఇప్పటికే సమంత తో గతంలో సామ్ జామ్ అనే కార్యక్రమాన్ని ప్లాన్ చేసి ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయించారు. ఇక ఈ కార్యక్రమం కాస్త టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంది అనే విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఇదే తరహాలో సరికొత్తగా వినూత్నమైన కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణతో unstoppable అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో హోస్టుగా అవతారమెత్తిన బాలయ్య ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాడు. ఇకపోతే మరోవైపు యాంకర్ ప్రదీప్ తో మరో కార్యక్రమానికి కూడా ప్లాన్ చేశారు.
ఇక ఇప్పుడు ఆ యాంకర్ శ్రీముఖి తో చెఫ్ మంత్ర అనే కార్యక్రమాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా వేదికగా విడుదలయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అచ్చం గతంలో ప్రదీప్ నిర్వహించిన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే కార్యక్రమంలాగే.. ఈ కార్యక్రమం లో కూడా సెలబ్రిటీలను పిలిచి వారితో ముచ్చటిస్తుంది శ్రీముఖి. అంతేకాదు వారికి ఇష్టమైన వంటకాలను చేయించి ఇస్తుంది. ఇటీవలే విడుదలైన కార్యక్రమంలో హీరో సుహాస్.. హీరోయిన్లు రెజీనా, శ్రీయ లు కూడా శ్రీముఖి కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ లుగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇలా గెస్ట్ లుగా వచ్చిన వారు అందరూ తమదైన రీతిలో సందడి చేశారు.