చరణ్ తో స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించనున్న ఆ దర్శకుడు..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొన్ని రోజుల క్రితమే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు, దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇలా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఆర్ సి 15 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు, ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్ సి 15 సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కినుంది. ఇలా రామ్ చరణ్ ఇప్పటికే ఒక పాన్ ఇండియా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, మరొక పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు.


 ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే రామ్ చరణ్ తన తదుపరి సినిమా  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించాడు. గౌతమ్ తిన్ననూరి నాని హీరో గా తెరకెక్కిన జెర్సీ సినిమాతో దర్శకుడి గా మంచి పేరు సంపాదించుకున్నాడు, ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్ లో జెర్సీ సినిమాను షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ , గౌతమ్ తిన్ననూరి సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి , రామ్ చరణ్ హీరో గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా ను తెరకెక్కించబోతున్నాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: