భారతీయుడు -2 షూటింగ్ జరిగేది అప్పుడేనా...?

murali krishna
సౌత్ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వంలో ఇండియన్‌ 2 షూటింగ్ ప్రారంభం అయ్యి మద్యలో నిలిచి పోయిన విషయం అందరికి తెల్సిందే. ఆ సినిమా ప్రారంభం అయ్యింది మొదలు ఏదో ఒక వివాదం వల్ల ఆగుతూనే వచ్చిందని తెలుస్తుంది.

చివరకు సినిమా షూటింగ్ సందర్బంగా క్రేన్ యాక్సిడెంట్‌ అవ్వడంతో షూటింగ్‌ నిలిచి పోయిందని తెలుస్తుంది.మళ్లీ షూటింగ్‌ ను పునః ప్రారంభించేందుకు గాను ప్రయత్నాలు జరిగినా కూడా అవి సఫలం అవ్వలేదని సమాచారం.. ఈ లోపు కరోనా వచ్చిందని తెలుస్తుంది.దాంతో మొత్తం షూటింగ్ లు ఆగిపోయాయట కరోనా సమయంలో రామ్‌ చరణ్ తో సినిమా కు శంకర్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.. ఇండియన్‌ 2 పూర్తి అవ్వకుండా చరణ్‌ తో సినిమా చేయడానికి వీలు లేదు అంటూ లైకా వారు కోర్టును ఆశ్రయించారట . దాంతో కోర్టు మద్యవర్తులతో ఈ సమస్యకు పరిష్కారం చూసుకోవాల్సిందిగా సూచించిందని సమాచారం.

కోర్టు సూచించినట్లుగా మద్యవర్తులతో లైకా మరియు శంకర్ ల మద్య ఒప్పందం కుదిరిందని తెలుస్తుంది.శంకర్‌ ఇండియన్ 2 ను ముగించేందుకు ఓకే చెప్పాడట.దాదాపుగా సగం వరకు షూటింగ్‌ పూర్తి అయిన ఇండియన్ 2 కోసం నాలుగు నెలల సమయం కేటాయిస్తాను అంటూ శంకర్ హామీ ఇచ్చాడని తెలుస్తుంది.ఆ సమయంలో ఇతర నటీ నటుల డేట్లను తీసుకోవాల్సిన బాధ్యత లైకా వారికి ఇచ్చాడట దాంతో ఇప్పుడు హడావుడిగా లైకా వారు ఆ పనుల్లో ఉన్నట్లుగా సమాచారం.

అయితే ప్రస్తుతం రామ్‌ చరణ్‌ 15వ సినిమా రెండవ షెడ్యూల్‌ ను శంకర్‌ చేస్తున్నాడట.ఆ షెడ్యూల్‌ పూర్తి అయిన వెంటనే ఇండియన్ 2 కు వెళ్తాడనే వార్తలు వస్తున్నాయని తెలుస్తుంది.కాని అసలు విషయం ఏంటీ అంటే చరణ్ మూవీ పూర్తి చేయకుండా ఇండియన్ 2 ను శంకర్ మొదలు పెట్టకూడదని తెలుస్తుంది .. అది దిల్ రాజుతో శంకర్ చేసుకున్న ఒప్పందమట.కనుక సమ్మర్ వరకు సినిమా ను ముగించి దిల్‌ రాజు చేతిలో పెట్టి ఆ తర్వాత ఇండియన్ 2 ను శంకర్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారట సినీ విశ్లేషకులు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: