ఆ విషయంలో సరియైన సమాచారం ఇవ్వని వెంకటేష్...!

murali krishna
టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేసే స్టార్ హీరోలలో వెంకటేశ్ ఒకరని తెలుస్తుంది.కానీ ప్రస్తుతం ఆయనొక్కడే చేతిలో కొత్త ప్రాజెక్ట్ లేకుండా ఉన్నారని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారని ఇక గాడ్ ఫాదర్ షూటింగ్‌తో పాటు భోళా శంకర్ మరియు బాబీ సినిమాలను మొదలుపెడుతున్నారని తెలుస్తుంది.ఇలా ఆయన చాలా బిజీగా ఉన్నారట నాగార్జున బంగార్రాజు సినిమాతో పాటు ప్రవీణ్ సత్తారు సినిమా చేతిలో ఉన్నాయని తెలుస్తుంది.. ఇక బాలయ్య అఖండ సినిమాను పూర్తి చేసి ఇటీవలే క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టారని తెలుస్తుంది

అలాగే యంగ్ హీరోలందరూ మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారట. ఈ ఏడాది వెంకటేశ్ నారప్ప సినిమాతో వచ్చి హిట్ అందుకున్నారని తెలుస్తుంది.. నవంబర్ 25న దృశ్యం 2 సినిమాతో రాబోతున్న విషయం అందరికి తెలిసిందే.ఇక వరుణ్ తేజ్‌తో కలిసి చేస్తున్న ఎఫ్ 3 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట ఈ క్రమంలోనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన వెంకీ తన అన్న కొడుకు రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ చేస్తున్నారట.అంతే తప్ప కొత్తగా సైన్ చేసిన ప్రాజెక్ట్ ఏంటీ..దర్శకుడెవరు అనే విషయాలలో వెంకటేశ్ నుంచి క్లారిటీ రావడం లేదని తెలుస్తుంది.

Ve

నారప్ప సినిమా రిలీజ్‌కు ముందు పెళ్ళి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వెంకీ నెక్స్ట్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయని తెలుస్తుంది.. తేజ దర్శకత్వంలో కూడా వెంకటేశ్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగిందట.. అలాగే మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైల్ స్టోన్ మూవీ 75వ సినిమా ఉంటుందని బాగానే ప్రచారం జరిగినట్లు తెలుస్తుంది.. కానీ తేజ దగ్గుబాటి అభిరాం ను హీరోగా పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నాడట.. త్రివిక్రమ్ ఇప్పటికే మహేశ్ బాబు సినిమాను మొదలు పెట్టబోతున్నాడట.కాబట్టి ఈ ఇద్దరి దర్శకులతో వెంకీ ప్రాజెక్ట్ ఉండే అవకాశాలు లేవని అర్థమవుతోందని సమాచారం.ఈ లెక్కన చూస్తే ఇంకా వెంకటేశ్ కొత్త ప్రాజెక్ట్‌ను కమిటయ్యాడా లేదా అనేది క్లారిటీ లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: