రాజకీయాల్లోనే కాదు నార్మల్ గా కూడా ప్రజా సేవ చేయొచ్చు అని నిరూపిస్తున్న ప్రకాష్ రాజ్

P.Nishanth Kumar
రాజకీయాలలోకి సినిమా నటులు రావడం కొత్తేమీ కాదు. ఎంతో మంది సినిమా వారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసి ఇప్పటివరకు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఆ విధంగా ఇప్పుడు కూడా కొంత మంది వర్ధమాన నటులు రాజకీయాల్లోకి వచ్చి తమ వంతు కృషిగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారు. వారిలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. నటుడిగా ప్రకాష్ రాజ్ ఎంతటి గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. తెలుగులో జాతీయ స్థాయిలో అవార్డు తీసుకువచ్చిన నటుడిగా ప్రకాష్ రాజ్ కు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.

రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆయన ఎన్నో తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ గత సాధారణ ఎన్నికలలో ఆయన ఓడిపోవడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులను నిరాశలు అలుముకున్నాయి. పోనీ సినిమా నటుల అధ్యక్షుడిగా అయినా గెలిచి సినిమా వారికి సేవ చేయాలని ముఖ్యంగా నటీనటులను కాపాడుకోవాలని ఆయన భావించగా ఇప్పుడు అక్కడ కూడా ఓడిపోవడం ప్రకాష్ రాజ్ ను తీవ్రమైన వేదనకు గురి చేసిందని చెప్పాలి. 

ఏదేమైనా ప్రజలకు సేవ చేయాలనే ప్రకాష్ రాజ్ కోరిక తీరకపోవడం ఇప్పుడు ఒక్కసారిగా అందరినీ ఎంతగానో కలవరపరుస్తోంది. మరి ఇలాంటి ఓటములకు భయపడని ప్రకాష్ రాజ్ భవిష్యత్తులో తన పోరాటాన్ని ఇంకా కొనసాగిస్తాడా.. అలుపెరగకుండా పోరాడి గెలిచి ప్రజలకు సేవ చేయాలనే తన కలను సాకారం చేసుకుంటాడా అనేది చూడాలి. సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావడం మాత్రమే కాదు బయట ఉండి కూడా సేవ చేయొచ్చు అని పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా తనకు వీలైనంత సామాజిక సేవ చేస్తూ నటుడిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ప్రకాష్ రాజ్.మరి సేవ చేయాలనే దృక్పథం ఉంటె ఎలాంటి పరిస్థితులలోనైనా సేవ చేయొచ్చు అని చెప్పడానికి ప్రకాష్ రాజ్ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: