కరోనా వేళలో మెగా కోడలి సేవాకార్యక్రమాలు ప్రశంసనీయం...
ఈ సంస్థలోని వారందరికీ కరోనా సమయంలో భోజనాలను ఏర్పాటు చేయడం, ఈ ట్రస్ట్ తరపున నుండి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి అలాగే సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు వేల మాస్కులు పంపిణీ చేశారు, నిత్యావసర వస్తువులు, పిపిటి కిట్స్ వంటివి పంపిణీ చేశారు ఉపాసన. వృద్దాశ్రమాల్లోని వారికి నిరంతరం మందులను పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. అంతే కాకుండా యూ ట్యూబ్ వేదిక ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించడం. మహిళల్లో వికాసానికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఎప్పుడూ ప్రజలకు టచ్ లో ఉంటున్నారు.
బి పాజిటివ్ హెల్త్ మ్యాగజైన్ కి ఎడిటర్ గా కూడా విధులను నిర్వహిస్తున్నారు ఉపాసన. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి గానూ మహాత్మాగాంధీ అవార్డును కూడా అందుకున్న ఘనత ఆమెకు దక్కింది. వేల కోట్లకు వారసురాలు అయినా మెగా ఇంటి కోడలిగా వచ్చినా సాధారణ మహిళ గానే చాలా సింపుల్ గా తన జీవన శైలిని గడుపుతుంటారు ఉపాసన. ఉపాసన లాగా ఇంకా చాలా మంది సంపన్నులు పేదల బాధలను అర్ధం చేసుకుని పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.