ప్రభుదేవా- నయనతార విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా..??

N.ANJI
చిత్ర పరిశ్రమలో దాదాపుగా రెండు దశాబ్దాల పైగానే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ నేటికీ ప్రముఖ హీరోలతో సమానంగా తమ జీవితాన్ని గడుతున్న నటి నయనతార. ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా పిలవబడే నయనతారకి కుర్రకారులో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఒక పక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే మరొక పక్క ప్రముఖ హీరోల పక్కన హీరోయిన్ గా సినిమాలో నటిస్తూనే ఉన్నారు. ఇక కుర్ర హీరోయిన్లకు కూడా ఈమె గట్టి పోటీ అనే చెప్పాలి మరి. అయితే ప్రస్తుతం నయనతార ఒకొక్క సినిమాకి 7 కోట్ల రూపాయలు దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నది. అయితే నయనతార ప్రభుదేవా, శింబులతో ప్రేమ వ్యవహారం నడిపిన సంగతి అందరికి తెలిసిందే. కాగా.. మొదట్లో శింబుతో కొన్ని వ్యక్తిగత విభేదాల వల్ల విడిపోయింది నయన్. ఆ తరువాత ఆమె ప్రభుదేవాతో ప్రేమలో పడి వివాహం చేసుకోవాలని అనుకుంది. అయితే డాన్స్ మాస్టర్ ప్రభుదేవా చెప్పినట్లు గానే వివాహం తరువాత సినిమాలు కూడా ఆపేస్తాను అంటూ, అప్పట్లో ఆమె చేసిన శ్రీ రామరాజ్యం చిత్రమే ఆఖరి సినిమా అని చెప్పుకొచ్చింది ఈ భామ. ఇక చివరికి ప్రభుదేవా మొదటి భార్య పెట్టిన కొన్ని షరతులు వల్లనే ఏమో ప్రభుదేవాతో కూడా పెళ్లి రద్దు చేసుకున్నట్లు సమాచారం.
ఆ తరువత సినిమాలపై ఫోకస్ పెట్టిన నయనతార మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొంత కాలం నుండి ఆమె తమిళ దర్శకుడు విష్నేష్ శివన్ తో హజీవనం చేస్తున్న చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక వీరిద్దరూ బర్త్ డే వేడుకలు, క్రిస్మస్, ఓనమ్ ఇలా ఏ పండుగ వచ్చినా ఈ ఇద్దరూ సెలబ్రేట్ చేసుకని సోషల్ మీడియాలో ఫొటోలను జంటగా షేర్ చేసి వైరల్ అవుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: