ఆ విషయంలో నానిని బాగా హర్ట్ చేసిన బడా హీరోలు..?

VUYYURU SUBHASH
నేచురల్ స్టార్ నాని సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా సక్సెస్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నాని..ఒక్కప్పుడు ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. మొదట సహాయ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన ఆ తరువాత తన టాలెంట్ తో సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో అష్టాచమ్మా అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైయాడు. ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా నటించి..అభిమానుల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు..అంతేకాదు నాని అంటే ఇది అనేలా ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు ఈ హీరో.

ఒక్కప్పుడు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన నానికి..ఇప్పుడు ఓ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడం కూడా కష్టమైపోతుంది. మనం చూసిన్నట్లైతే వరుసగా నాని సినిమాలో అట్టర్ ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంటున్నాయి. ఇక ఈ క్రమంలో నాని ఆశలన్నీ "శ్యామ్ సింగ రాయ్" మీదే పెట్టుకున్నాడు. మొదట నుండి ఈ సినిమా గురించి లీక్ అవుతున్న సమాచారం బట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు నాని అభిమానులు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆ అంచనాలను ఢబుల్  చేసేసింది.

అయితే, ఇక్కడ నానికి ఓ పెద్ద సమస్య వచ్చి పడిన్నట్లు తెలుస్తుంది. డిసెంబరు నెలలో వరుసగా మూడు బడా హీరోల సినిమాలు రీలీజ్ అవుతున్న తరుణంలో..నానికి ధియేటర్స్ విషయంలో భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయట. డిసెంబరు నెలలో అఖండ, గని, పుష్ప సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. తన మార్కెట్ కు  మించి భారీ బడ్జెట్లో తీసీన "శ్యామ్ సింగ రాయ్" సినిమాను వీలైనంత ఎక్కువ ధియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేసిన నానికి..మెగా హీరో వరుణ్ తేజ్ గట్టి దెబ్బేసాడు. ఎవరికి పోటీ లేకుందా  తన సినిమాను సోలోగా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో నాని ఆయన సినిమాను  డిసెంబరు 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అనూహ్యంగా మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమా కూడా అదే రోజు ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ మూమెంట్ లో నానికి కి  థియేటర్లు దొరక్కట్లేదు. ఇక ఈ విషయంలో నాని ఆవేదనతో ఉన్నాడని.. టాలీవుడ్ లో బడా  హీరోలకున్న సపోర్ట్ సొంతంగా పైకి ఎదిగిన తనలాంటి వారికి ఉండదంటూ బాధపడుతున్నట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: