బిగ్ బాస్ 5 : ఈవారం సన్నీ ఎలిమినేట్?
అయితే ఈ వారం కెప్టెన్ గా ఉన్నా రవి మినహా మిగతా ఎనిమిది మంది సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీంతోఇక ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితేఇక ప్రస్తుతం ఎలిమినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేయడానికి నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.ఇక ఈ టాస్క్ లో భాగం గా ఎవరు ఏవిక్షన్ పాస్ దక్కించు కోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా ఇటీవలే కెప్టెన్సీ టాస్క్ లో గెలుపొందిన మానస్ కొత్త కెప్టెన్ గా మారిపోయాడు.
అయితే బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఎంతో రసవత్తరంగా ఆడుతున్న సమయంలో ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది అంటూ గతవారం కెప్టెన్ రవి జోస్యం చెప్పాడు. ఒకవేళ సన్నీ ఎవిక్షన్ పాస్ గెలిచినప్పటికీ ఎలిమినేషన్ సమయంలో సన్నీ కచ్చితంగా అవిక్షన్ పాస్ వినియోగించుకోడు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు రవి. అందుకే సన్నీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ జోస్యం చెప్పాడు. అయితే ఈ వారం ఇక టాస్క్ పూర్తయ్యేవరకూ సన్నీ ఎవిక్షన్ పాస్ దక్కించుకో బోతున్నాడు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్.