హాట్
బ్యూటీ శృతి హాసన్ తమిళ సినిమాలతో తెరంగేట్రం చేసినప్పటికీ తెలుగు లోనూ అనేక సినిమాలలో నటించింది,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన
గబ్బర్ సింగ్ సినిమాతో
శృతిహాసన్ బాక్సాఫీస్ వద్ద
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ
సినిమా విజయంతో ఈ ముద్దుగుమ్మకు
టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించే అవకాశం కూడా వచ్చింది. అలా ఎంతో మంది
టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన శ్రుతిహాసన్ అతి తక్కువ కాలంలోనే తెలుగు నాట టాప్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ అన్ని ముద్దుగుమ్మ
ప్రభాస్ హీరోగా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది, ఈ
సినిమా తో పాటు
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా
శృతిహాసన్ హీరోయిన్గా నటించబోతోంది, ఇప్పటికే ఈ
సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
ఇలా వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతున్న
శృతి హాసన్ తాజాగా తన అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగా శ్రుతిహాసన్ అనేక ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చింది. మీకు షాపింగ్ చేయడం, ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ కొనడం ఇష్టమా.? అని ఒక నెటిజన్ అడిగాడు. అవును నాకు షాపింగ్ చేయడం అంటే ఇష్టం. అలాగే సమయం దొరికినప్పడు కూడా గ్రాసరీస్ కొంటాను. కొనడం అంటే నాకు ఇష్టం. వాటిని తీసుకు వచ్చిన తర్వాత నేనే వండుతాను. నాకు అది ఇష్టం అని ఈ ముద్దుగుమ్మ తెలిపింది. టాటూల గురించి
శృతిహాసన్ ని అడగగా ఈ ముద్దుగుమ్మ తన ఒంటిపై ఉన్న టాటూలను చూపించింది. మరొక నెటిజన్ మీకు మామూలుగా బ్లాక్ అంటే ఇష్టం కదా.. ఈ రోజు ఏంటి వైట్ డ్రెస్ లో ఉన్నారు అని అడిగాడు. అవును నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం కానీ ఈరోజు నేను ఆ రంగు దుస్తులను ధరించడం లేదు. కానీ నాకు తెలుపు రంగు అంటే నచ్చదు. కానీ ఈ రోజు ఈ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నానో నాకే తెలియదు అంటూ
శృతిహాసన్ చెప్పుకొచ్చింది.