కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో నాగార్జునే ముందుంటారని అందరికి తెలుసు.మంచి కథలు కాబట్టి రీమేక్ చేసాం అనే హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ కూడా సినిమా కథలో రిస్క్ ఉందని తెలిసినా ముందడుగు వేసేది ఆయన మాత్రమేనని అందరికి తెలిసిన విషయమే.
టాలీవుడ్ కు ఆయన పరిచయం చేసిన దర్శకులు ఎంతో మంది ఉన్నారని అందరికి తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అక్కినేని అందగాడి గురించి చాలా విషయాలే ఉంటాయని తెలుస్తుంది.. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాగార్జున ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారని తెలుస్తుంది.
నిర్మాతగా ఆయన 30సినిమాలు వరకు రూపొందించారని తెలుస్తుంది.. ఇదిలా ఉండగా ఓసారి నాగార్జున వద్దకి ఓ స్టార్ డైరెక్టర్ కథ చెప్పడానికి వచ్చాడని తెలుస్తుంది.. అది నాగ్ కు నచ్చినా సరే రిజెక్ట్ చేసాడని సమాచారం.. అలా అని దానిని పక్కన పెట్టలేదట మరో హీరోతో చేసి హిట్ కొట్టారని తెలుస్తుంది.ఆ సినిమా మరేదో కాదు 'ఆహా'. 1998వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాని 'బాషా' 'మాష్టర్' వంటి హిట్ చిత్రాలని తెరకెక్కించిన సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడని సమాచారం.. 1997 ఆయన తమిళంలో తెరకెక్కించిన 'ఆహా' కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తుంది.
ఈ కథని ముందుగా నాగార్జునతో చేద్దాం అనుకున్నారట దర్శకుడు సురేష్ కృష్ణ. అందుకు నాగ్ ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు కూడా చేస్తానని హామీ ఇచ్చారని తెలుస్తుంది. అయితే నాగ్ మాత్రం మంచి కథని చెడగొట్టడం ఎందుకు.. మరో హీరోతో చేద్దాం అని చెప్పుకొచ్చారని సమాచారం.. నేనే ప్రొడ్యూస్ చేస్తానని నాగ్ హామీ ఇచ్చారని తెలుస్తుంది.. అలా జగపతి బాబుని ఒప్పించి 'ఆహా' గా చేశారని తెలుస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుందని సమాచారం.ఇందులో పాటలన్నీ సూపర్ హిట్టే..! నేటితో ఈ చిత్రం విడుదలై 23 ఏళ్ళు పూర్తికావస్తోందని తెలుస్తుంది.