సినిమా ఇండస్ట్రీలోకి
హీరోయిన్ లు ఎన్నో కలలతో వస్తూ ఉంటారు. వచ్చే వారందరూ కూడా మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవలని వాటితో స్టార్
హీరోయిన్ గా ఎదగాలని అనేక కలలుకంటూ ఉంటారు. అలా ఎన్నోకలలతో ఇండస్ట్రీకి వచ్చిన వారిలో కొంతమంది మాత్రమే తమ మొదటి సినిమాతోనే మంచి విజయాలను సాధించి ఆ తర్వాత కూడా వరుస విజయాలను అందుకుంటూ టాప్
హీరోయిన్ గా కొనసాగుతారు. అలా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించి ప్రస్తుతం
టాలీవుడ్ టాప్
హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న వారిలో
రాశి ఖన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ
నాగ శౌర్య హీరోగా
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చింది.
ఎంతో సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ
సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయంగా నిలిచింది, మరియు
రాశి కన్నా అందచందాలకు, నటనకు కూడా
టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది. ఇలా మొదటి సినిమాలోనే తన నటనతో, అందచందాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మకు
టాలీవుడ్ లో క్రేజీ
సినిమా ఆఫర్లు కూడా దక్కాయి. అందులో భాగంగా తొలిప్రేమ, హైపర్,
బెంగాల్ టైగర్, శివమ్, వెంకీమామ, సుప్రీమ్, శ్రీనివాస కళ్యాణం, జై లవకుశ, జోరు వంటి పలు సినిమాలలో నటించి
టాలీవుడ్ టాప్
హీరోయిన్ ల సరసన చేరిపోయింది.