టాలీవుడ్ లో కాజల్ క్రేజ్ తగ్గలేదా...?
వివాహం తర్వాత పెద్దగా కాజల్ వార్తలు లేకపోయినా సరే ఆమెకు తెలుగు సినిమా పరిశ్రమలో ఏ మాత్రం కూడా క్రేజ్ తగ్గలేదు అని కొంత మంది అగ్ర నిర్మాతలు కొన్ని కొన్ని పాత్రలకు అవసరమైతే కాజల్ పేరును పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇక కాజల్ కూడా కొన్ని కొన్ని విషయాల్లో కాస్త డిమాండ్ చేయకుండా తెలుగు సినిమా నిర్మాతలకు నచ్చిన విధంగా ముందుకు వెళుతుందని కూడా సమాచారం. ప్రస్తుతం కాజల్ చేతిలో ఒక్క సినిమానే ఉన్నా సరే ఆమెకు మరి కొన్ని ఆఫర్లు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఉందని దీనికి సంబంధించి కొరటాల శివ ఇప్పటికే మాట్లాడారని కూడా సమాచారం. ఈ సినిమా ఐటమ్ సాంగ్ కి సంబంధించి ఒక ప్రముఖ రచయిత ఆమె కోసం పాట చాలా నీట్ గా రాస్తున్నారని ఆమె ఈ స్థాయికి తగిన విధంగా ఈ పాట ఉంటుందని కూడా అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే తెలుగులో సినిమాలు చేయకపోయినా వివాహంతో సినిమాలకు దూరంగా ఉన్నా సరే కాజల్ క్రేజు తగ్గకపోవడం మాత్రం ఆమె అభిమానులను అలరించే చేస్తున్న విషయం అనే చెప్పాలి.