టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఆర్ఆర్ఆర్ అని చెప్పవచ్చు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ మూవీ ఆర్ఆర్ఆర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఆలియా భట్, ఒలీవియా మోరిస్ అలాగే అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించారని అందరికి తెలుసు..
ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు పీక్స్ లో ఉన్నాయని తెలుస్తుంది.ఇక ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ రాజమౌళి తన ప్లాన్ ను చేస్తున్నాడట.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారని తెలుస్తుంది.. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రొమోషన్స్ లో కూడా వేగం పెంచేసాడటరాజమౌళి. ఈ క్రమంలోనే ఈ రోజు సోల్ ఆఫ్ ఆర్.ఆర్.ఆర్ సాంగ్ కి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసాడటరాజమౌళి.
ఈ సందర్భంగా ఈ సాంగ్ గురించి ఎంత కష్టపడ్డారో ఈ సాంగ్ సినిమాకు ఎంత ముఖ్యమైనదో తెలిపాడని తెలుస్తుంది.ఈ సమావేశంలో మీడియాను ఎలాంటి ప్రశ్నలు వేయవద్దని రాజమౌళి సూచించాడని సమాచారం.ఎందుకంటే ఈ సమావేశం కేవలం ఈ సాంగ్ కోసమేనని.. ప్రమోషనల్ కార్యక్రమం కాదని చెప్పాడట.ప్రొమోషనల్ కార్యక్రమం అయితే ఆ హడావిడి వేరేగా ఉంటుందని రాజమౌళి తెలిపాడని తెలుస్తుంది.. ఇప్పుడు మాత్రం 'జనని' సాంగ్ ను మాత్రమే ఫీల్ అవ్వమని తెలిపాడని తెలుస్తుంది. ఇక సాంగ్ కోసం ఎంత కష్టపడ్డారో ఎన్ని రోజుల సమయం పట్టిందో అంత వివరించాడట రాజమౌళి. ఈ సినిమాకు మణిహారంలో దారం లాంటిదని ఈ జనని సాంగ్ ఈ సినిమాకే సోల్ గా నిలిచి పోతుందని చెప్పారట.. ఇక ఈ సాంగ్ రీరికార్డింగ్ ప్రాసెస్ ను బాగా ఎంజాయ్ చేసామని ఇక కీరవాణి మా పెద్దన్న ఈ సినిమాలోని జనని సాంగ్ కోసం 2 నెలల సమయం రీరికార్డింగ్ చేసాక కూడా మళ్ళీ కొర్ కోసం సర్చ్ చేసారని చెప్పాడట.ఇక చివరికి ఒక మెలోడీతో మా ముందుకు వచ్చారని అంటూ ఈ సాంగ్ గురించి జక్కన్న తెలిపాడని తెలుస్తుంది.