ట్యూషన్ కి వెళ్లేటప్పుడు.. టీచర్ రే తప్పుగా ప్రవర్తించాడంటున్న బుల్లితెర నటి..!
లైంగిక వేధింపులు అనేది ఎక్కువగా నిర్మాతలు హీరోలు దర్శకులు పైనే కొంతమంది ఆరోపణలు చేయడం చూస్తూనే ఉంటాము. ఇందులో కొన్ని నిజాలు ఉంటాయి మరి కొన్ని వదంతులు గానే మిగిలిపోతాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఒకనాటి తన చిన్న వయసులోనే జరిగిన ఒక అనుభవాన్ని వివరించింది. ఆమె ఎవరో కాదు హిందీ బుల్లితెరపై తనకంటు ఒక పేరు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యాక్టర్ దేవోలీనా భట్టాచార్య. ఈమె బిగ్ బాస్ షోలో కూడా బాగా ఆకట్టుకుంది.
రీసెంట్ గా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చిన్న వయసులో జరిగిన ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఆ వయసులోనే తన లైంగికంగా వేధింపులకు గురైనట్లు తెలిపింది. చిన్నతనంలో తన ట్యూషన్ కి వెళుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక లెక్కల మాస్టర్ తనతో తప్పుగా ప్రవర్తించినట్లు ఆమె తెలిపింది. అతడి చేసే అటువంటి చేష్టలు బాగా లేకపోవడంతో ఈ విషయాన్ని తన అమ్మకి చెప్పినట్లుగా తెలిపింది.
ఈ విషయం తెలిసిన తల్లి వెంటనే ఆ మాస్టర్ ఇంటికి వెళ్లి.. జరిగిన విషయాన్ని అంత తన భార్యకి తెలియజేసింది. కానీ కానీ తనకి ఆ టీచర్‌పై పగ తీర్చుకోవాలని కసి ఉన్నదని చెప్పుకొచ్చింది ఆమె. ఇలా చిన్నతనంలోని ఇలాంటి పనులు చేసే వాళ్ళను అసలు విడిచి పెట్టకూడదు అని చెప్పుకొస్తోంది దేవోలీనా భట్టాచార్య..