జెమినీ టీవీ లో ఎవరు మీలో కోటీశ్వరుడు అనే రియాలిటీ షో ప్రసారమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆగస్టు నెలలో నుండి విరామం లేకుండా కొనసాగుతున్న ఈ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షో వీక్ డేస్ లలో మాత్రమే వస్తుంది అయినప్పటికీ ఇంట్లోకి అనుకోని రేటింగ్స్ వస్తాయి కానీ నెమ్మది నెమ్మదిగా ఎప్పుడు తగ్గిపోయింది. అయినా సరే అయితే నిర్మాతలు మాత్రం ఏ మాత్రం పట్టు వదలకుండా సమయానుసారం పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.
ఈ షో కి రాజమౌళి, సమంత, థమన్,కొరటాల శివ, రామ్ చరణ్, దేవి శ్రీ ప్రసాద్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇకపోతే తాజాగా మీరందరూ వచ్చి వెళ్ళిన తర్వాత ఇటీవల మహేష్ బాబు కూడా ఈ షోకి గెస్ట్ గా రానున్నట్లు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి తాజాగా ఒక ప్రోమో ను కూడా విడుదల చేయడం జరిగింది ఇకపోతే ఆ ప్రోమో కి భారీ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఉ స్పెషల్ గెస్ట్ గా రాబోయే ఈ షోని డిసెంబర్ 2న టెలికాస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గెస్ట్ గా వచ్చిన మహేష్ షో లో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఎన్ని రూపాయలు గెలుచుకుంటాడు అన్న దానిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ప్రేక్షకులు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు 25 లక్షల రూపాయలను గెలుచుకున్నాడని అని తెలుస్తోంది. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ ఒకటికి వాయిదా పడింది. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే త్రివిక్రమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు మహేష్...!!