తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది దర్శకులు తమ తమ మొదటి
సినిమా తోనే అదిరిపోయే
బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకుంటూ ఉంటారు. అలాంటి దర్శకులలో
సురేందర్ రెడ్డి ఒకరు. ఈ దర్శకుడు కళ్యాణ్
రామ్ హీరో గా సింధు తులాని
హీరోయిన్ గా నటించిన అతనొక్కడే సినిమాతో దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చాడు, ఈ సినిమాను
సురేందర్ రెడ్డి రివెంజ్ ప్లేస్
మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు. తమ కుటుంబాన్ని మొత్తం పంపినందుకు విలన్ మీద పగ తీర్చుకోవడం కోసం
హీరో కళ్యాణ్
రామ్,
హీరోయిన్ సింధు తులాని ఎలాంటి ప్రయత్నాలు చేశారు, విలన్ కి వీరికి మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి, అనే దానిని
మాస్ యాంగిల్ లో చూపించిన
సురేందర్ రెడ్డి మొదటి
సినిమా తోనే బాక్సాఫీస్ దగ్గర
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.
ఈ
సినిమా కళ్యాణ్
రామ్, సింధు తులాని కి కూడా మంచి విజయాన్ని తీసుకువచ్చింది. ఇలా మొదటి
సినిమా తోనే మంచి విజయం అందుకున్న
సురేందర్ రెడ్డి ఇప్పటికి కూడా
టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు.
సురేందర్ రెడ్డి అశోక్, ఊసరవెల్లి,
కిక్,
కిక్ టు, రేసుగుర్రం,
సైరా నరసింహారెడ్డి, ధ్రువ తో పాటు పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. దర్శకుడు
సురేందర్ రెడ్డి, సైరా నరసింహారెడ్డి సినిమాను పాన్
ఇండియా రేంజ్ లో తెరకెక్కించాడు, ఈ సినిమాలో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించాడు. ఈ సినిమాతో
సురేందర్ రెడ్డి ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇలా ఎన్నో మంచి విషయాలను అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం అక్కినేని
అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.