బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో డిసెంబర్ నెలలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. అయితే ఇటీవలే దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ నిశ్చితార్థం జరగడం.. ఆ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తెలిసిందే. అయితే ఎందుకనో ఈ జంట తమ రిలేషన్ విషయంలో మొదటినుంచి గోప్యత పాటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి సంబంధించి రోజుకో వార్త బాలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరు ముంబైలో కోర్టు మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పటివరకూ తన పెళ్లిపై అటు కత్రినా కానీ విక్కీ కౌశల్ గానీ వారి కుటుంబానికి చెందిన సభ్యులు కానీ స్పందించిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ మరోవైపు వీరి పెళ్లి పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కత్రినా పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆమె పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించే మెహందీ ఫంక్షన్ లో కత్రినా పెట్టుకునే హెన్నా కోసం ఆమె భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. జోధ్‌పూర్‌లోని పాలీ జిల్లాలో ఎంతో ప్రత్యేకంగా తయారుచేసే ఈ హెన్నాను సోజత్ మెహేంది అని అంటారట.
దానికి సంబంధించిన మెహిందీ నమూనాలు ఇప్పటికే కత్రినా కైఫ్ కు చేరాయని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎటువంటి కెమికల్స్ మిక్స్ చేయకుండా ఈ హెన్నా సహజసిద్ధంగా తయారవుతుందని, అందుకే దీని తయారీకి సుమారు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. అయితే ఆ హెన్నాను తయారు చేసే వ్యక్తి సెలబ్రిటీ కఫుల్స్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోడట. దీంతో ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది.మరో వైపు రాజస్థాన్‌లో జరగనున్న వీరి వివాహానికి బాలీవుడ్ నుంచి చాలామంది సెలబ్రిటీలు హాజరు కాబోతున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి...!!