బిగ్ బాస్ 5 : మళ్లీ హోస్ట్ గా రమ్యకృష్ణ?
అయితే ప్రస్తుతం తెలుగులో మాదిరిగానే అటు తమిళంలో కూడా బిగ్ బాస్ 5వ సీజన్ నడుస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక తమిళ బిగ్బాస్ కార్యక్రమానికి లోకనాయకుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇటీవలే కమలహాసన్ కరోనా వైరస్ బారిన పడ్డారు అన్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయన.దీంతో ఈ వారాంతంలో బిగ్ బాస్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ఎవరు రాబోతున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అయితే కమలహాసన్ స్థానంలో శృతిహాసన్ ను తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇక ఇప్పుడు తమిళ బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారిపోయింది..తమిళ బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్గా రమ్యకృష్ణ రాబోతుందట. ఇప్పటికే రామకృష్ణకు తెలుగు బిగ్బాస్ కార్యక్రమంలో హోస్టింగ్ చేసిన అనుభవం వుంది. నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వెళ్లిన సమయంలో రమ్యకృష్ణ హోస్టింగ్ చేసి అదరగొట్టింది. ఇలా రమ్యకృష్ణ కు అనుభవం ఉండడంతో తమిళ్ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా రమ్యకృష్ణ ను రంగంలోకి దింపాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం రమ్యకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.