బాలయ్య టాక్ షోలో మోక్షజ్ఞ..?

Anilkumar
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం కోసం అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారు తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞ మాత్రం ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి బాలయ్య ఓ ప్రకటన చేశారు. ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉండబోతోందని బాలకృష్ణ చెప్పాడు. అంతేకాదు అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని 2023లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని బాలయ్య అన్నారు.

 ఇక ఈ ప్రాజెక్టు ఆదిత్య 999 మాక్స్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు అని చెప్పిన బాలయ్య, అయితే ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదు అని చెబుతూ అవకాశం ఉంటే దాన్ని తనే డైరెక్ట్ చేసే చాన్స్ ఉందని కూడా చెప్పాడు. తన తండ్రి ఎన్టీఆర్ తాతమ్మకల అనే సినిమాలో మొదట తనకు అవకాశం ఇవ్వడంతోపాటు ఎలాంటి మెలకువలు నేర్పించాడో, తాను కూడా తన కొడుకు మోక్షజ్ఞ కోసం అలాంటి మెళుకువలు నేర్పిస్తానని కూడా చెప్పాడు. అయితే తన తండ్రి దర్శకత్వంలో సినిమాతో పలకరించడానికి కంటే ముందే మోక్షజ్ఞ బాలయ్య హోస్ట్ చేస్తున్న టాక్ షో కి హాజరు కాబోతున్నారట. ప్రముఖ ఐటి సంస్థ ఆహా కోసం బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే.

 ఇప్పటికే ఈ టాక్ షో కి పలువురు సెలబ్రిటీ గెస్ట్ లు హాజరయ్యారు. మొదటి ఎపిసోడ్ కి మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ ఇక రెండవ ఎపిసోడ్ నాచురల్ స్టార్ నాని,మూడవ ఎపిసోడ్ కి విజయ్ దేవరకొండ కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ టాక్ షో కు మోక్షజ్ఞ కూడా హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే కనుక నిజమైతే ఇక నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోవడం ఖాయమని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: