ఆర్ ఆర్ ఆర్ పై భారతీయుడు ప్రభావం !

Seetha Sailaja

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ‘జనని’ పాటకు యూత్ నుండి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ పాట విన్న మధ్య వయస్కులు మాత్రం ఈపాట పై పెదవి విరుస్తున్నారు. దేశభక్తి నేపధ్యంలో నిర్మాణం జరుపుకున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన ‘జనని’ పాటలో చెప్పుకోతగ్గ ఎమోషన్ లేదని కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు ఈ పాట ట్యూనింగ్ కూడ క్యాచీ గా లేదని సుమారు 25 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడు మూవీలోని ఛాయలు ‘ఆర్ ఆర్ ఆర్’ లో కనిపించ బోతున్నాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో స్వాతంత్రోద్యమ నేపధ్యం ఉంటుంది.

ఆ మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కమలహాసన్ సేతుపతి పాత్ర ఛాయలు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని అజయ్ దేవగన్ పాత్రలో కనిపిస్తుందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్తి పరుస్తున్నారు. ముఖ్యంగా ‘భారతీయుడు’ మూవీలో సేతుపతి పాత్రలో నటించిన సుకన్య పాత్రకు ఇచ్చిన గెటప్ కు ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో అలియా భట్ పాత్రకు గెటప్ ఒకేవిధంగా ఉంది అంటూ కొందరు మిడిల్ ఏజ్ వ్యక్తులు కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

అంతేకాదు మరికొందరు అయితే మరొక అడుగు ముందుకు వేసి నేటితరం ప్రేక్షకులకు రాజమౌళి అలనాటి ‘భారతీయుడు’ సినిమాకు కొద్దిగా మార్పులు చేసి అదే మూవీ స్పూర్తితో ‘ఆర్ ఆర్ ఆర్’ తీస్తున్నాడా అంటూ కామెంట్స్ కూడ కొందరు చేస్తున్నారు. వాస్తవానికి నేటితరానికి చెందిన ప్రేక్షకులకు స్వాతంత్రోద్యమ కథలు పెద్దగా తెలియదు. అయితే చరిత్రలో ఎక్కడా కనిపించని సంఘటన అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ఒకచోట కలిస్తే ఏమౌతుంది అన్న ఊహ చుట్టూ అల్లబడ్డ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కథ విషయంలో విమర్శకుల నుండి గట్టి విమర్శలు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: